- 22-10-2009 :: 6 :30 PM
- మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ నేడు మన మార్కెట్లు వరుసగా మూడవ రోజు నష్టాలను చూసాయి. ఉదయం మా అంచనాలకి అనుగుణం గా నేడు భల్లూకాలు ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని మార్కెట్లో చాటుకున్నాయి. దీంతో సెన్సెక్స్ నేడు 219 పాయింట్లు క్షీణించి 16789 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 4989 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 17 వేల పాయింట్లు, నిఫ్టీ 5 వేల పాయింట్ల మానసిక ఊరట కలిగించే స్థాయిలను కోల్పోయి ,1.29 % ,1.48 % చొప్పున క్షీణించాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం అత్యధికం గా 2.12 % నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం 1.96% క్షీణించింది. నేటి ట్రేడింగ్ లో రియాలిటి రంగం 4.59 % భారిగా క్షీణించింది. క్యాపిటల్ గూడ్స్ రంగం కూడా 2.69 % బలహీనపడింది . కాగా FMCG రంగం 0.95 %, ఐ.టి 0.79 % చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. నేటి సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , JP ASSOCIATES 6.8%, DLF 4.9 % నష్టాలను చవిచూడగా INFOSYS 2.1%, ITC 1.6% మేరకు లాభపడ్డాయి.