• 22-10-2009 :: 9:15 AM
  • మార్కెట్ నాడి

రుణాల పై పెరుగుతున్న నష్టాల నేపథ్యం లో ప్రపంచ వ్యాప్తం గా మార్కెట్ల లో బ్యాంకింగ్ రంగం నష్టాలను చవి చూస్తున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టపోగా, నేడు ఆసియా మార్కెట్లు సైతం ఇదే పంధా కొనసాగిస్తున్నాయి. చైనా మార్కెట్ల లో ఈ త్రైమాసలో వృద్ధి రేటు 8.9 % సాధించిన వార్తలు వస్తున్నప్పటికీ , ఆసియా మార్కెట్లు కోలుకోలేక పోతున్నాయి. గత రెండు రోజులు గా నష్టపోతున్న మన మార్కెట్లు నేడు కూడా అదే ధోరణి కొనసాగించే అవకాశం కనిపిస్తున్నది. దీనితో, మార్కెట్లు సంవత్ 2066 ప్రారంభం లో నే నష్టాల హట్రిక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RIL- RNRL వివాదం పట్ల సుప్రీం కోర్ట్ సూచించిన విధం గా అంబాని సోదరులు సామరస్యం గా చర్చల ద్వారా పరిష్కారం కొరకు ముందుకు వస్తే , నేడు మార్కెట్లు కొంత పుంజుకుంటాయి. కాని పక్షం లో నేడు భల్లూకాలు ( BEARS) మార్కెట్ల లో నేడు తమ సత్తా చాటనున్నాయి. ఐతే ఉద్దీపన విధానాలు కొనసాగుతాయని ఆర్ధిక మంత్రి ప్రకటించటం మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశం. క్షీణిస్తున్నఅమెరికా డాలర్ విలువ కారణం గా నేడు బంగారం ధర పుంజుకునే అవకాశం ఉంది. ఇతర కామోడిటి ల పట్ల కూడా మదుపర్లు ఆసక్తి కనపరచ వచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17009
  • అవరోధాలు: 17124-17230-17366-17449
  • మద్దత్తులు:17014-16978-16844-16754