• 21-10-2009 :: 5:45 PM

  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు లాభార్జన వైపు మొగ్గుచూపాయి. దీనితో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 214 పాయింట్లు కోల్పోయి 17,009 వద్ద నిలిచింది. ఇది మేము ఉదయం సూచించిన కీలక మజిలి ఐన 17014 పాయింట్ల కి అత్యంత సమీపమని గుర్తించాలి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 5,064 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.24 శాతం, నిఫ్టీ 0.99 శాతం మేరకు బలహీనపడ్డాయి.

అంబానీ సోదరుల గ్రూపు సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరియు రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్‌ (ఆర్ఎన్ఆర్ఎల్)లు.. మధ్యవర్తిత్వం ద్వారా గ్యాస్ సరఫరా వివాదాన్ని ఎందుకు పరిష్కరించుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ అంశం పై ఇరు పార్టీల వైఖరి అస్పష్టం గా ఉండటం తో మార్కెట్లు చివరి దశ లో మరింత క్షీణించాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.07 % నష్టపోగా , స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.23 % లాభపడింది. నేటి ట్రేడింగ్ లో రియాలిటీ రంగం ౦. 23 % వృద్ధి ని నమోదు చేయగా, టెక్ రంగం స్వల్పంగా .04 % పెరిగింది . కాగా నేడు ఆటో రంగం లాభార్జనకు గురిఅవ్వటం తో 2.36 % క్షీణించింది. FMCG ఇండెక్స్ 2.06, బ్యాంకింగ్ ఇండెక్స్ 2 % మేరకు నష్టపోయాయి.

నేటి సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, TCS 1.94 %, TATA POWER 1.54 % స్వల్ప లాభాలను ఆర్జించగా , TATA STEEL 3.96 %, JP ASSOCIATES 3.56 % నష్టాలను నమోదు చేసాయి.