- 21-10-2009:: 8 am
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా లో నూతన గృహ ప్రారంభ గణాంకాల లో తగ్గుదల సూచించటం తో అక్కడి మార్కెట్లు నష్టాల తో ముగిసింది. లండన్ మార్కెట్ల లో కమాడిటి లు కూడా నష్టపోవటం తో నేడు ఆసియా మార్కెట్లు నష్టాల తో పయనిస్తున్నాయి. ఈ ప్రభావం నేటి ప్రారంభ ట్రేడ్ లో మన మార్కెట్ల పై పడనున్నది.
మన దేశం లో చోటు చేసుకుంటున్న పరిణామాలను చర్చిస్తే, నిన్న సుప్రీం కోర్ట్ అంబాని సోదరులకు " అక్షింతలు" వేసి, నేడు కూడా ఈ కేసు గురించి వాదోప వాదాలు విననున్నదని ప్రకటించింది. సుప్రీం కోర్ట్ నేడు చేయబోయే వ్యాఖ్యానాలు మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇక బుల్ల్స్ ఆయుధాలను పరిశీలిస్తే, కేంద్ర కాబినెట్ ప్రభుత్వ రంగ వ్యవస్థల పునవ్యవస్తీకరణ గురించి మరిన్ని నిర్ణయాలు నేడు తీసుకోనున్నది. ఈ అంశం వలన నైవేలి లిగ్నైట్ , ఎస్ . టి. ఐ. , ఏం .ఏం. టి.సి. , హిందూస్తాన్ కొపేర్ , సెయిల్ మున్నగు కంపనీల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ పై కీలక నిర్ణయాలు వెలవడ నున్నాయి . పైగా రిటైల్ మదుపర్ల కు ఇందులో 5 % డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేడు బుల్ల్స్ ప్రధానం గా PSU కౌంటర్ల పై తమ పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణ గణాంకాలు ఇక పై నెలకొక సారి విడుదల చేయనున్నట్లు కాబినెట్ ప్రకటన వలన బాండ్ మార్కెట్ల లో ఆటు పోట్లు తగ్గనున్నాయి. ఈ అంశం పట్ల బాండ్ మార్కెట్లు సానుకూలం గా స్పందించ నున్నాయి.
నేటి ఈక్విటీ మార్కెట్ల తదుపరి గమనం చర్చిస్తే, ఆసియా మార్కెట్ల ప్రభావం వలన నిన్నటి లాభార్జన నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. మార్కెట్లు నేడు గ్యాప్ డౌన్ తో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17223
- అవరోధాలు: 17231-17373-17449-17505
- మద్దత్తులు:17096-17014-16978-16844