• 20-10- 2009
  • మార్కెట్ రిపోర్ట్

లాభార్జన కోసం సాగిన క్రయవిక్రయాల్లో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 103 పాయింట్లు కోల్పోయి 17,223 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 5,114 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.58 శాతం, నిఫ్టీ 0.54 శాతం మేరకు బలహీనపడ్డాయి.ఆసియా మార్కెట్ల నుంచి వీచిన సానుకూల సంకేతాల ప్రభావంతో.. 78 పాయింట్లు లాభంతో 17,414 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో స్టాక్ మార్కెట్ మరింతగా బలపడి గరిష్టం గా 17457 పాయింట్ల వరకు చేరుకుంది. ఇది నేటి ఉదయం మేము సూచించిన కీలక మజిలి ఐన 17449 పాయింట్ల అవరోదానికి సరిపోయిందని గుర్తించాలి. అయితే చమురు మరియు సహజవాయువుల ఇండెక్స్ స్టాకుల్లో లాభార్జన కోసం సాగిన లావాదేవీల ప్రభావంతో.. స్టాక్ మార్కెట్ కుదేలయింది.రిలయన్స్ అంబానీ సోదరుల మధ్య గ్యాస్ వివాదంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో.. ఈ స్టాకులు నష్టపోయాయి. దీంతో ఈ నష్టాల ప్రక్రియలో సెన్సెక్స్ 17,185 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది. బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ రికవరీ అయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.స్వల్పంగా రికవరీ అయినప్పటికీ.. తిరిగి అది కొద్ది సేపు మాత్రమే నిలిచింది. దీంతో చివరికి స్టాక్ మార్కెట్ నష్టాలతో 17223 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది కూడా మేము ఉదయం సూచించిన 17231 పాయింట్లకి అత్యంత సమీపమని గుర్తించాలి. స్టాక్ మార్కెట్ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. బీఎస్ఈ రియాల్టీ, మెటల్, ఐటీ ఇండెక్స్‌లు మాత్రం సానుకూల లాభాలతో ముగిశాయి.ఇవి 0.90 %, 0.81 % చొప్పున వృద్ధి సాధించాయి. కాగా చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ 1.70 %, కన్సుమేర్ డ్యురాబుల్ల్స్ 1.50 % నష్టపోయాయి.

నేడు మిడ్ క్యాప్ రంగం 0.06 %, స్మాల్ క్యాప్ రంగం 0.15 % చొప్పున లాభపడ్డాయి. కాగా నేటి సెన్సెక్స్ స్టాకు ల లో టాటా స్టీల్ 2.09 % లాభపడగా , MNM 3 % , RCOM 2.85 % చొప్పున నష్టపోయాయి.