• 20-10-2009
  • మార్కెట్ నాడి :: 8AM

మెరుగైన కంపనీ ఫలితాల నేపధ్యం లో ఆసియా మార్కెట్లు, నిన్నటి ట్రేడింగ్ లో కనపరిచిన ఉత్సాహం, నేడు కూడా కనపరుస్తున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్లు కూడా hedge fund కుంబకోణం వలన నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితి ని పక్కకి పెట్టి లాభాల బాట లో నడవటం తో నేడు మన మార్కెట్ల లో బుల్ల్స్ కి ఉత్సాహం కలిగించనున్నాయి.

కంపనీ ల రెండవ త్రై మాసిక ఫలితాలు, NTPC మున్నగు ప్రభుత్వ రంగ సంస్థల పై కాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మన మార్కెట్లను సానుకూలం గా ప్రభావితం చేయనున్నాయి. ఐతే నేడు ప్రధానం గా మన మార్కెట్లు, RIL -RNRL గ్యాస్ వివాదం పై సుప్రీం కోర్ట్ వైఖరి పై దృష్టి కేంద్రీకరించ నున్నాయి. ఈ అంశం పై కోర్ట్ స్పందన మార్కెట్లను ప్రభావితం చేయనున్నది. RIL కి అనుకూలం గా కోర్ట్ వ్యాఖ్యానిస్తే మార్కెట్లు మరింత గా పుంజు కో నున్నది.

శనివారం ట్రేడింగ్ లో జరిగిన విధం గా అధిక స్థాయి ల లో మార్కెట్లు మరొక సారి అమ్మకాల వత్తిడికి గురియ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17326
  • అవరోధాలు: 17373-17449-17505
  • మద్దత్తులు:17231-17124-17014