మార్కెట్ ముందుచూపు
(20-10-2009 నుండి 23-10-2009 )
గత వారం మార్కెట్లు 17 నెలల గరిష్ట స్థాయి లో ముగిసాయి. గత శని వారం దీపావళి సందర్భం గా ముహురత్ ట్రేడింగ్ తో విక్రం సంవత్ 2066 సంవత్సరానికి స్వాగతం పలికింది.
శనివారం ట్రేడింగ్ లో 17493 పాయింట్ల గరిష్ట స్థాయి కి సెన్సెక్స్ చేరుకొని, చివరికి మూడు పాయింట్ల స్వల్ప లాభం తో ఫ్లాట్ గా 17326 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5142 వద్ద నిలిచింది. . గత వారం మార్కెట్ ముందు చూపు శీర్షిక లో సెన్సెక్స్ నకు 17505 పాయింట్ల టార్గెట్ ని మేము సూచించగా, మా అంచనాలని ఇంచుమించు నిజం చేస్తూ 17493 కి చేరుకుంది. కాగా గత వారం ఆగష్టు నెల కి చెందిన IIP పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు అధ్బుతం గా ఉండటం , కంపనీల రెండవ త్రై మాసిక ఫలితాలు , ముఖ్యం గా బ్యాంకింగ్ రంగం దిగ్గజాలు ఆశాజనకం గా ఉండటం తో మార్కెట్లు బలపడ్డాయి.
ఈ వారం కూడా మార్కెట్లు తమ దృష్టి ని ప్రధానం గా కంపనీల ఫలితాల పై దృష్టి ని కేంద్రీకరించ నున్నాయి. అంతే కాక పెక్కు కంపనీలు QIP ద్వారా నిధుల సమీకరణకి కసరత్తు లు చేయనున్నట్లు వార్త. ఈ అంశం వలన స్టాకు ల వారి గా మార్కెట్లు ట్రేడ్ కా నున్నాయి. ఈ వారం కేంద్ర కాబినెట్ NTPC , MMTC మున్నగు కంపనీల లో ని వాటాలను విక్రయించే దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. దీనిని అనుసరించి మార్కెట్లు లో కొంత ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంది. అదే విధం గా RIL- RNRL గ్యాస్ వివాదం పట్ల సుప్రీం కోర్ట్ మరికొన్ని నిర్దేశాలు 20 వ తేదిన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నది.
ఇక ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే , అమెరికా మార్కెట్ల లో HEDGE ఫండ్ కుంభ కోణాల పై అక్కడి ప్రభుత్వచేపట్టే చర్య , చర్చనీయ అంశం కానున్నది. ఈ అంశం అమెరికా మార్కేట్లని కొంత ఆటుపోట్ల కి గురిచేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం మన మార్కెట్ల పై కూడా కొంత కనపడవచ్చు. బలహీన పడుతున్న డాలర్ వలన , కామో డిటి లు , ముఖ్యం గా పసిడి, చమురు ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. FII క్రయ విక్రయాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
సెన్సెక్స్ నకు 17096- 16843- 16 ,613 కీలక మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 16613 వద్ద సెన్సెక్స్ నకు విశేషమైన మద్దత్తు ఉంది. ఈ మద్దత్తు వీగిపోతే ఈ వారం 16110 పాయింట్ల వరకు సెన్సెక్స్ క్షీణించే ప్రమాదం ఉంది. కాగా 17373-17505 - 17730 సెన్సెక్స్ నకు అవరోధాలు .