15-10-2009 :: 6 pm
మార్కెట్ రిపోర్ట్
రెండు రోజుల భారి వృద్ధి తరువాత , నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు కొంత నిలకడ ప్రదర్శించి దాదాపు ఫ్లాట్ గా ముగిసింది. దీనితో బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సూచీ 36 పాయింట్లు స్వల్పం గా కోల్పోయి 17195 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ పాయింట్లు 9 కోల్పోయి పాయింట్ల వద్ద 5109 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ సమయం లో విడుదల ఐన అక్టోబర్ 3 తో ముగిసిన వారానికి ధరల సూచీ గణాంకాలు విడుదల అయ్యాయి . ఇది 0.22 % పెరిగి ౦. 92 % గా నమోదు అయ్యింది. ఇది ధరల అస్థిరత. మాంద్యానికి నిదర్శనం గా ఉండటం తో మార్కెట్లు పుంజుకో లేక పోయాయి.
ఉదయం స్వల్ప లాభాల తో 17274 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 17350 పాయింట్ల వరకు ఎగబాకింది. కాని అమ్మకాల వత్తిడి వలన స్వల్పం గా క్షీణిస్తూ చివరి వరకు ట్రేడ్ కా సాగింది. ఒక దశ లో కనిష్టం గా 17092 పాయింట్ల వరకు క్షీణించిన సెన్సెక్స్ చివరికి నిలదొక్కు కొని 17195 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ 0.55 %, స్మాల్ క్యాప్ రంగం 0.87 % వృద్ధి పొందటం విశేషం.
సేక్టరాల్ రంగాల లో నేడు కూడా మెటల్స్ , బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట లో నడిచాయి. ఇవి 1.72 %, 1.58 % చొప్పున లాభాలను ఆర్జించాయి. కాగా టెక్ , ఐ. టి రంగాలు 1.54 %. 1.34 % చొప్పున క్షీణించాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు Bharti airtel 4.2 % , Sun pharma 3.5 % అత్యధికం గా నష్టాలను నమోదు చేయగా, SBI, Tata Power 2.7%, 1.9 % చొప్పున లాభపడ్డాయి.