• 17-10-2009

  • గమనిక : మన తెలుగువారికి ఉపయుక్తం గా ఉండే విధం గా ఈ వెబ్సైటు తీర్చిదిద్దేందుకు నిరంతరం చేస్తున్న మా కృషి లో భాగం గా మీకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో , అతి త్వరలో SMS ద్వారా stock tips అందించ నున్నాము . ఈ సేవలను ఉపయోగించుకోదలచిన వారు మీ mobile numbers & e-mail id లను " సంప్రదించండి" పేజి ద్వారా రిజిస్టర్ చేసుకోగలరు. -www.telugustockmarket.com)

  • 17-10-2009

  • దీపావళి ముహురత్ ట్రేడింగ్
  • ( నేటి సాయంత్రం 6:15 నుండి రాత్రి 7:15 వరకు )
దీపావళి శుభ సందర్భం గా మదుపర్లు లక్ష్మి పూజ అనంతరం ముహూరత్ ట్రేడింగ్ లో పాల్గొని లక్ష్మి దేవి ఆశీర్వాదం పొంద గోరనున్నారు. కాబట్టి నేటి ట్రేడింగ్ లో ఇతర విషయాల కంటే కూడా సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషించనున్నది. కంపనీల రెండవ త్రై మాసిక ఫలితాలు ఉత్సాహం నెలకొల్పే విధం గా ఉండటం వలన నేటి విశేషమైన ట్రేడింగ్ లో బుల్ల్స్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఐతే గత రాత్రి అమెరికా లో CIT గ్రూప్ దివాలా కి సమీపం లో ఉన్నదని తెలియటం, GALLEON హెడ్జ్ ఫండ్ అధినేత రాజారత్నం INSIDER TRADING ఆరోపణల నేపధ్యం లో పట్టుపడటం వంటి అంశాలు అమెరికా మార్కెట్లను క్రుంగ దీసాయి. పైగా నానాటికీ బలహీనమౌతున్న అమెరికా డాలర్ కూడా అమెర్చియా మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేసాయి. ఈ అంశం మన మార్కెట్ల పై కొంత ప్రభావితం చేయగల అంశం ఐనప్పటికీ, ముందుగా చర్చించినట్లు, నేడు సెంటిమెంట్ ట్రేడింగ్ కనుక , మన మార్కెట్లు లాభాల లో ముగిసేప్రయత్నం చేయనున్నాయి.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17323
  • అవరోధాలు: 17373-17449-17505
  • మద్దత్తులు:17231-17124-17014