14-10-2009 :9:30 am

మార్కెట్ నాడి

సోమవారం ఉత్తర కొరియా ఐదు క్షిపణులు ప్రయోగించటం తో అమెరికా మార్కెట్లు,కొంత అప్రమత్త ధోరణి తో ట్రేడ్ అయ్యి ఫ్లాట్ గా ముగిసాయి. ఈ ప్రాభావం ఆసియా మార్కెట్ల పై పడటం తో నిన్న మార్కెట్లు ఆసియా మిశ్రమంగా ముగిసాయి. కాగా గత రాత్రి అమెరికా మార్కెట్ల లో ఇంటెల్ కంపనీ ఫలితాలను అనుసరించి మార్కెట్ల లో కొంత ఉత్సాహం గా ముగిసాయి నేడు ఆసియా మార్కెట్ల లో కూడా కొంత ఉత్సాహం నెలకొని ఉంది. ముఖ్యం గా చైనా ఎగుమతుల గణాంకాలు అంచనాలకి మించి ఉండటం తో ఆసియా మార్కెట్ల లో కొంత బలం కనపడుతోంది.

ప్రపంచ మార్కెట్ల లో గత రెండు రోజులు గా జరిగిన పరిణామాలను నేడు మన మార్కెట్లు పరిగణలో కి తీసుకొని ట్రేడ్ కానున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లకు GOLDMAN SACH , భారత దేశం లో మొత్తం ఎనిమిది మేటి ఫార్మ కంపనీల లో పెట్టుపడి పెట్టమని సూచన ఇవ్వటం వలన నేటి ట్రేడింగ్ లో ముఖ్యం గా ఫార్మ స్టాకు ల కు మద్దత్తు లభించే అవకాశం ఉంది. ,

మన మార్కెట్ల పరం గా ఆలోచిస్తే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఉత్తమంగా ఉండటం తో భారి గా వృద్ధి చెందాయి. ఈ వృద్ధి తో ఉద్దీపన ప్యాకేజీలు అనుకున్న ఫలితాలు సాధించాయని, కాబట్టి ఈ నెల 27 న జరగబోయే RBI వడ్డీ రేటు సమీక్ష లో వడ్డీ రేటు పెంచే అవాకాశాలు ఉన్నాయని అంచనాలు . ఈ అంశం మార్కెట్లను ప్రాభావితం చేసే అవకాశం ఉంది. అదే విధం గా RCOM ఆడిటర్ నివేదిక మార్కెట్ గుండెల్లో గుబులు పుట్టించే విధం గా ఉంది. స్టాక్ ఎక్సేంజ్ లకు, TRAI కి నివేదించిన ఆదాయం వివరాల లో సుమారు 2917 కోట్ల మేరకు తేడా ఉన్నదని, సుమారు 617 కోట్ల రూపాయల మేరకు ఆదాయం రెండు సార్లు లెక్కల లో చూపించి , సత్యం ఉదంతం తరహ లో ఆదాయాని వస్తవానికంతే ఎన్నో రేట్లు పెంచినట్లు, గత సంవత్సరం EBITA , నిజానికి 42% తక్కువగా ఉన్నదని ఆడిటర్ తెలియజేసారు. ఈ అంశం పై మరిన్ని వివరాలు నేడు తెలియనున్నాయి. సత్యం మాదిరి మరొక కోర్పోరేట్ అవకతవకలు వెలుగులోకి RCOM రూపం లో రానున్నదా అని మార్కెట్ నేడు అత్యంత భయాందోళనతో ఎదురుచూడనున్నది.

నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

  • గత ముగింపు: 17026
  • అవరోధాలు: 17124-17230-17366-17449
  • మద్దత్తులు:17014-16978-1644-16754