12-10-2009

మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 384 పాయింట్లు పుంజుకుని 17,027 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 5,054 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 2.31 శాతం, నిఫ్టీ 2.21 శాతం మేరకు వృద్ధి చెందాయి.ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో 44 పాయింట్ల లాభంతో 16,687 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అక్కడ నుంచి ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లాభాల ట్రెండ్ సాయంత్రం వరకు అదే బాటలో నడిచింది. ఉదయం ప్రారంభ ట్రేడ్‌లో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు స్వల్పంగానే లాభపడింది.ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు ఇందుకు కారణమయ్యాయి. అయితే ఆ తర్వాత విడుదల పారిమాశ్రామికోత్పత్తి (ఐఐపీ) సంఖ్యలు.. స్టాక్ మార్కెట్లో బుల్స్‌కు ఎనలేని బలాన్నిచ్చాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి 10.4 శాతం పెరిగినట్లు విడుదలైంది. ఇది అంతకుముందు 6.89 శాతం వద్ద ఉండేది.ఈ బలమైన వృద్ధికి అనూహ్యంగా మార్కెట్లో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. అలాగే అదే సమయంలో.. ఇదే విధంగా ఆశ్చర్యపరిచేట్లు ఆర్థిక రికవరీ కూడా నడుస్తోందని.. త్వరలోనే అత్యధిక వృద్ధి సాధిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలతో మార్కెట్ సెంటిమెంట్ మరింతగా మెరుగుపడింది.నేటి ముగింపు , ఉదయం మేము సూచించిన 17014 పాయింట్ల కీలక స్థాయికి అత్యంత సమీపం గా 17024 పాయింట్ల వద్ద ముగియటం నేటి విశేషం.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.22% , స్మాల్ క్యాప్ రంగం 1.05% వృద్ధి చెందాయి. నేటి ట్రేడింగ్ లో అన్ని సేక్టరాల్ రంగాలు లాభాల లో ముగియటం విశేషం. నేటి ట్రేడింగ్ లో కన్సుమేర్ డ్యురబుల్ల్స్ అత్యధికం గా 3.72 % ఎగబాకింది. కాగా ఐ.టి ఇండెక్స్ 2.94 % వృద్ధిని నమోదు చేసింది.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే SBI , REL INFRA 5.2 % , 5 % చొప్పున లాభం పొందగా , HERO HONDA , RCOM 0.9 %, 0.6 % చొప్పున నష్టపోయాయి.