14-10-2009 :: 5:40 PM
మార్కెట్ రిపోర్ట్
సానుకూల ప్రపంచ మార్కెట్ల నడుమ మన మార్కెట్లు నేడు మరొక సారి భారి వృద్ధి ని నమోదు చేసింది. మన బ్యాంకు ల రెండవ త్రై మాసిక ఫలితాలు మెరుగవుతున్న ఆర్ధిక పరిస్థి కి దర్పణం పట్టటం తో నేటి ట్రేడింగ్ లో ఆద్యంతం బుల్ల్స్ తమ జోరు ని కొనసాగించాయి. దీంతో సెన్సెక్స్ 204 పాయింట్లు వృద్ధి చెంది 17231 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మేము ఉదయం సూచించిన 17230 పాయింట్ల కీలక మజిలీ కి సరిపోయిందని గుర్తించాలి. నేడు నిఫ్టీ 64 పాయింట్లు ఎగబాకి 5118 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో స్మాల్ క్యాప్ రంగం 1 .54 % , మిడ్ క్యాప్ రంగం 1.96 % వృద్ధి చెందాయి.
నేడు టెక్ రంగం మినహా అన్ని సేక్టరాల్ రంగాలు లాభాలను ఆర్జించాయి. టెక్ రంగం స్వల్పం గా 0.37 % క్షీణించింది. కాగా మెటల్స్ 5 .27 % , క్యాపిటల్ గూడ్స్ 2. 38 % ఎగబాకాయి. సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు ఉదయం మేము చర్చించిన విధం గా RCOM భారిగా నష్టపోయింది. ఈ కౌంటర్ 6 .5 % నష్టపోగా, BHARTI AIRTEL 3.2 % బలహీనపడింది. MNM 6.1%, STERLITE 5.4 % వృద్ధి పొందటం నేటి ట్రేడింగ్ విశేషం.