- 12-10-2009 :: 8:45 am
- మార్కెట్ నాడి
సింగపూర్ ఆర్థిక పరిస్థి కోలుకుంటున్నదని సంకేతాలు , అక్కడ విడుదల అయిన రెండవ త్రైమాసిక GDP ఫలితాలు వలన వెలువడటం తో ఆసియా మార్కెట్ల లో నేడు జోరు నెలకొంది. సింగపూర్ లో వరుస గా రెండవ సారి అంచనా కంటే తక్కువగా క్షీణత నమోదు కావటం, ప్రపంచ వ్యాప్తం గా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేటు ని పెంచేందుకు సముఖత వేలుబుచ్చటం వంటి అంశాలు ఆర్ధిక మాంద్యం అంత మయ్యే అవకాశం ఉన్నందున నేడు ఆసియా మార్కెట్లు బలం గా ట్రేడ్ అవుతున్నాయి.
మన మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్ల ప్రభావం వలన కొంత ఊరట పొందే అవకాశం ఉంది. నేడు IIP గణాంకాలు వేలవడనున్నాయి. ప్రధానం గా నేడు మార్కెట్లు ఈ ఫలితాల పై దృష్టి కేంద్రీక రించ నున్నాయి. నేడు యాక్షిస్ బ్యాంకు, HDFC బ్యాంకు రెండవ త్రై మాసిక ఫలితాలు వెలువడనున్నాయి. రెండు దిగ్గజ బ్యాంకు ల ఫలితాలు ఒకే రోజు వెలువడు తున్నాయి కాబట్టి ఈ అంశం నేడు ఇతర బ్యాంకింగ్ స్టాకు ల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
టెక్నికల్ గా చార్టులు కొంత బలహీనం గా వున్నా ఆసియా మార్కెట్ల ప్రభావం వలన కొంత మన మార్కెట్లు కొంత ఎగబాకే ప్రయత్నం చేయవచ్చు. కాని 17 వేల మార్కు వద్ద తిరిగి అమ్మకాల వత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.
నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు : గత ముగింపు: 16642 మద్దత్తులు:16613-16565 -16340-16237 ఆవరోధాలు :16754-16866-16978- 17014