మార్కెట్ ముందుచూపు

(12-10-2009 నుండి 17-10-2009 )

ఈ వారం స్టాక్ మార్కెట్లు పూర్తి గా ఆరు రోజులు ట్రేడ్ కానున్నాయి . దీపావళి పండుగ సందర్భం గా ముహురత్ ట్రేడింగ్ కారణం గా మదుపర్ల కు అరుదైన, సుదీర్ఘ ట్రేడింగ్ అవకాశం లభించనున్నది. ఈ వారం స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకం అని చెప్పవచ్చు. గత చరిత్ర ని తిరగేస్తే, దీపావళి కంటే ముందుగానో, లేక దీపావళి కి వెనువెంటనే , అక్టోబర్ నెల లో మన స్టాక్ మార్కెట్లు భారి గా పతనమయ్యాయి. గడిచిన 18 సంవత్సరాల లో 11 సార్లు మార్కెట్లు భారి గా క్షీణించాయి. ఈ నేపధ్యం లో , మునుపెన్నడూ లేని అప్రమత్త తోమార్కెట్లు ఈ వారం ట్రేడ్ కానున్నాయి.

గత వారం TRAI కొత్త బిల్లింగ్ పద్దతి ప్రతిపాదన తో టెలికాం స్టాకు లు కుదేలు మన్నాయి. వారం చివరి లో TRAI కొంత వివరణ ఇవ్వటం తో ఈ స్టాకు ల పతనం ఆగినప్పటికీ , ఈ అంశం మరిన్ని వివరాల గురించి మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే RCOM 22 %, IDEA 15 %, AIRTEL 21 % మేరకు క్షీణించాయి. TRAI వివరణ ని బట్టి ఈ రంగం స్వల్పకాలిక భవితవ్యం ఆధారపడి ఉంది.

గత వారం RIL బోనస్ వాటాల ప్రకటన తుస్సు మంది. మార్కెట్లు ఈ అంశం పట్ల పెద్దగా స్పందిచక పోవటం , ఇన్ఫోసిస్ అద్భుత ఫలితాలు సైతం మార్కేట్లని అబ్బురపరచక పోవటం వంటి సంఘటనలు గమనిస్తే, ఈ అంశాలు ఇప్పటికే మార్కెట్లు పరిగణ లో కి తీసుకున్నాయని స్పష్టమౌతోంది. మార్కెట్లు ఇప్పటివరకు ఈ సంవత్సరం 72 % ఎగబాకింది. గత మూడు నెలలలో 18% వృద్ధిని కనపరిచింది. కాబట్టి ఈ వారం విడుదల కానున్న HDFC BANK, AXIS BANK, HDFC, EXIDE, SINTEX, ULTRATEC ఫలితాలు కూడా మార్కెట్ల ని పెద్దగా ఉత్తెజపరచలేక పోవచ్చు. కాని ఫలితాలు సరిగ్గా లేక పొతే ఖచ్చితం గా కృంగదీసే అవకాశం ఉంది. ప్రఖ్యాత మదుపరి శ్రీ జున్ జూన్ వాలా మరో రెండు నెలల లో మార్కెట్లు కుదేలు మనటం ఖాయం అని తేల్చి చెప్పటం కూడా ఈ అంశాన్ని బలపరిచే విధం గా ఉంది. పైగా జుంజున్ వాలా ప్రకటన తో " అదిగో పులి అంటే ఇదిగో తోక " అన్నవైనం లో మార్కెట్లు గత శుక్రవారం నుండే వణకటం ఆరంభించాయి . ఈ నేపధ్యం లో రానున్న రోజుల లో మార్కెట్ల సెంటిమెంట్ బలహీనం గా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ మారక విలువ, విదేశీ సంస్థాగత మదుపర్ల లావా దేవిలు , ఈ వారం విడుదల కానున్న కంపనీ ఫలితాలు మార్కెట్ తదుపరి గమనాన్ని ప్రభావితం చేయనున్నాయి. దీపావళి సెంటిమెంట్ కూడా మార్కెట్ పై ఉండనున్నది. ఈ నేపధ్యం లో మదుపర్లు మార్కెట్ లో సాహసం ప్రదర్శించటం మంచిది కాదు. వీలైనంత వరకు ఆచి తూచి వ్యవహరించటం మంచిది. చేతిలో క్యాష్ ఉంచుకుంటే, మార్కెట్లు దిద్దుబాటు జరిగినప్పుడు కొనుగోళ్ళు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారం ముఖ్యం గా 12, 13 తేదీలలో మార్కెట్లు పెరిగితే ,లాంగ్ పొజిషన్ల నుండి ఎగ్జిట్ కావటం శ్రేయస్కరం.

టెక్నికల్ గా సెన్సెక్స్ అతి కీలక ట్రెండ్ లైన్ మద్దత్తు స్థాయి ఐన 16 613 పాయింట్ల కి అతి చేరువ లో ముగిసింది. కాగా నిఫ్టీ ట్రెండ్ లైన్ కంటే దిగువగా ముగియటం గమనార్హం. నిఫ్టీ 4900 పాయింట్ల కంటే క్షీనిస్తే ఒక్క దెబ్బ కి మార్కెట్లు పడిపోయే అవకాశం ఉంది. సెన్సెక్స్ నకు 16 ,613- 16, 565 -16340-16237 కీలక మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 16613, 16 340 వద్ద సెన్సెక్స్ నకు విశేషమైన మద్దత్తు ఉంది. ఈ మద్దత్తు వీగిపోతే 14800 పాయింట్ల వరకు సెన్సెక్స్ క్షీణించే ప్రమాదం ఉంది. కాగా 16683-16843-17041- 17373-17505 సెన్సెక్స్ నకు అవరోధాలు .