• 09-oct-2009 :: 6 :30 pm
  • మార్కెట్ నాడి

స్టాక్ మార్కెట్ వారాంతంలో నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్లు కోల్పోయి 16,643 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్క్చేంజ్ నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 4,945 వద్ద ముగిసింది.. లాభార్జనకై సాగిన లావాదేవీలతో స్టాక్ మార్కెట్ నష్టాలను చవి చూసాయి.నిన్నటి స్వల్ప లాభాలను ఈ రోజు ఉదయం కూడా కొనసాగిస్తూ.. 72 పాయింట్ల లాభంతో 16,916 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో బాగా లాభపడి గరిష్టం గా 16963 పాయింట్ల వరకు ఎగబాకింది,. ఐతే మేము సూచించిన 16978 పాయింట్ల అవరోధం చెదించ లేక పోవటమూ, .. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాలు స్టాక్ మార్కెట్‌ను ఇక్కట్లలో పడేశాయి.దీనికి తోడు యూరోపియన్ మార్కెట్ బలహీన సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 16606 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే మేము ఉదయం సూచించిన 16613 పాయింట్ల మద్దత్తు నిలబడటం తో సెన్సెక్స్ కోలుకోని 16643 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రత్యక్ష పన్ను నియమావళికి సంబంధించి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు సైతం మార్కెట్‌లో విశ్వాసాన్ని చూరగొనలేకపోయాయి. ప్రత్యేకించి.. ఐటీ, ఆటో, బ్యాంకెక్స్, విద్యుత్, కన్‌స్యూమర్ గూడ్స్ తదితర కౌంటర్లలో విక్రయాలు భారీగా సాగాయి. వడ్డీ రేట్లు పెరగనున్నాయన్న ఆందోళనలతో బ్యాంకింగ్ స్టాకులు క్షీణించేందుకు కారణమయ్యాయి. . రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఫలితాలు ఐటీకి ఆశలు పెంచినప్పటికీ.. డాలరుతో రూపాయి మారక విలువ దోబూచులాడుంతుండటం ఆ ఆశలను తుంచివేసింది. అన్నిటి కన్నా ఆటో ఇండెక్స్ భారీగా నష్టపోయిందని చెప్పొచ్చు . ఆటో ఇండెక్స్ నేడు అత్యధికం గా 1.72 % నష్టపోగా ,బ్యాంకింగ్ రంగం 1.60 % క్షీనించింది . నేటి ట్రేడింగ్ లో కేవలం కన్సుమేర్ డ్యురబుల్స్ గ్రీన్ మార్కు లో ఉండింది. ఈ రంగం 0.35 % లాభం ఆర్జించింది.

నేడు మిడ్ క్యాప్ రంగం, స్మాల్ క్యాప్ రంగం 0.69 % చొప్పున సమానం గా నష్టపోవటం విశేషం.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , భారతి అయిర్ టెల్ 2.46 % వృద్ధిని నమోదు చేసింది. కాగా టాటా మోటార్స్ అత్యధికం గా 6.66 % బలహీనపడగా , రిలయన్స్ ఇన్ఫ్రా 2.91 % క్షీనించింది