- 07-10-2009 :: 8 :40 am
- మార్కెట్ రిపోర్ట్
ఆస్ట్రేలియా వడ్డీ రేటు ని పెంచటం వలన , ఆర్ధిక మాంద్యం అంతమౌతున్నదన్న సంకేతాలు వెలవడటం తో ప్రపంచ వ్యాప్తం గా సెంటిమెంట్ బలపడి గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. పైగా ఆస్ట్రేలియా డాలర్, వడ్డీ రేటు లో వృద్ధి వలన బలపడటం తో అమెరికా డాలర్ కొంత బలహీనపడింది. దీనివలన కామోడిటిలు ,ముఖ్యం గా బంగారం ధరలు ఎగబాకాయి. ఆర్ధిక మాంద్యం అంతమౌ తున్న సంకేతాల వలన క్రూడ్ ఆయిల్ ధర కి కూడా రెక్కలు వస్తున్నాయి. ఈ కారణాల వలన నేడు ఆసియా మార్కెట్ల లో కూడా కామోడిటి పటిష్టం గా ఉండటం తో ఈ మార్కెట్లు లాభాల బాట లో పయనిస్తున్నాయి. నేడు మన మార్కెట్లు కూడా ప్రపంచ మార్కెట్లకి అనుసంధానం గా ముందంజ వేసే అవకాశం ఉంది.
మన దేశం లో నెలకొని ఉన్నా పరిస్థి తి ని సమీక్షిస్తే, నేటి నుండి BSE విధించే ఫీజు లో సుమారు 7 % తగ్గించ నున్నది . ఈ అంశం బ్రోకేర్లు , ఆపరేటర్లు స్వాగతించనున్నారు . నేడు సుప్రీం కోర్ట్ లో RIL - RNRL గ్యాస్ వివాదం కి సంబంధించి RIL మరొక పిటిషన్ దాఖలు చేయనున్నది. ఈ అంశం మార్కెట్లు ఆసక్తి తో గమనించ నున్నది. ఆదిత్య బిర్లా తమ సిమెంట్ పరిశ్రమల విషయం లో అల్ట్రా టెక్ సిమెంట్ ల తో ఒప్పందానికి కసరత్తు చేయనున్నట్లు ఘంటా పదం గా చెప్పటం , నేడు మార్కెట్ల ల లో BEARS కి ప్రధాన ఆయుధం గా మారనున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16958
- మద్దత్తులు: 16844-16754-16613
- ఆవరోధాలు :16978- 17014 -17124