06-oct-2009 :: 6 :30 pm

మార్కెట్ రిపోర్ట్

నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు మేము సూచించిన విధం గా, తూ. చా తప్పకుండా నడుచుకున్నాయి. టెలికాం రంగం లో TRAI సూచించిన కొత్త బిల్లింగ్ పద్ధతి వలన టెలికాం కంపనీల యొక్క లాభాలు తీవ్రం గా ప్రభావితం అయ్యే సూచనలు ఉండటం తో , టెలికాం వాటాలుతీవ్రం గా నష్టపోయాయి. దీనితో సెంటిమెంట్ బలహీన పడి మార్కెట్లు నష్టపోయాయి .16879 పాయింట్ల వద్ద లాభాల తో ప్రారంభమైన సెన్సెక్స్ బలహీనపడి కనిష్టం గా 16622 పాయింట్ల వరకు క్షీణించింది. ఐతే ఉదయం మేము సూచించిన 16613 పాయింట్ల మద్దత్తు నిలబడటం తో , సానుకూల మైన ఐరోపా మార్కెట్ల ప్రభావం తో సెన్సెక్స్ మార్కెట్లు మరల పుంజుకొని గరిష్టం గా 16988 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే , మేము ఉదయం సూచించిన విధం గా 16978 పాయింట్ల అవరోధం బలిష్టం గా ఉండటం తో , సెన్సెక్స్ చివరికి 16958 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో సెన్సెక్స్ 92 పాయింట్ల వృద్ధిని నమోదు చేయగా , నిఫ్టీ 24 పాయింట్ల వృద్ధిని నమోదు చేస్తూ 5027 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦. 19 % వృద్ధి చెందగా , స్మాల్ క్యాప్ రంగం 0.72 % నష్టపోయింది. సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే నేడు FMCG 3.27%, మెటల్స్ 2.23 % చొప్పున లాభాలను ఆర్జించగా , టెక్ రంగం అత్యధికం గా 3.36 %, రియాలిటీ రంగం 0.85 % నష్టపోయాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు కూడా భారతి అయిర్ టెల్ మరొకసారి భల్లూకల ( BEARS ) చేతిలో దెబ్బతిన్నది.

ఈ కౌంటర్ 10.2 %, RCOM 10.6 % మేరకు నష్టపోయాయి. కాగా హిందాల్కో 6 %, HUL 5.6 % వృద్ధిని నమోదు చేసాయి.