07-10- 2009 :: 6 :30 pm

మార్కెట్ రిపోర్ట్

ఐటీ, బ్యాంకింగ్ షేర్లు క్షీణించడంతో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 152 పాయింట్లు కోల్పోయి 16,807 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 4,986 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.90 శాతం, నిఫ్టీ 0.83 శాతం మేరకు క్షీణించాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావంతో.. నిన్నటి లాభాలను కొనసాగిస్తూ..ఉదయం మేము చర్చించిన విధం గా ఈ రోజు ఉదయం 110 పాయింట్లు లాభంతో 17,069 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో లాభ పడి గరిష్టం గా 17120 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే మేము సూచించిన విధం గా 17124 పాయింట్ల వద్ద కీలక అవరోధాన్ని చెదించ లేక పోవటం తో ప్రాఫిట్ బూకింగ్ కి నాంది పలికింది. .. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ అనూహ్యంగా నష్టాల్లోకి జారుకుంది.డాలరుతో రూపాయి మారక విలువ పెరిగిపోయి 12 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ అంశం కూడా మేము నేటి ఉదయమే అంచనా వేయటం జరిగిందన్న విషయం గమనార్హం . దీంతో ఐటీ షేర్లు, బ్యాంకింగ్ షేర్లు బాగా బలహీనపడ్డాయి. దీంతో స్టాక్ మార్కెట్ మధ్యాహ్నపు ట్రేడ్‌ల వరకు నష్టాల్లోనే పయనించింది. నిన్నటి ట్రెండ్‌కు భిన్నంగా.. యూరోపియన్ మార్కెట్‌లు నేడు నష్టాల వద్ద ప్రారంభమయ్యాయి.దీంతో నష్టాలతో అప్పటికే కష్టాలు పడుతున్న స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు జోరు మరింతగా పెరిగింది. మధ్యాహ్నపు ట్రేడ్‌లో కొంత రికవరీ కాగలిగినా.. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభార్జన కోసం సాగిన భారీ విక్రయాలు తిరిగి రెడ్ మార్కులోకి ప్రవేశించేందుకు దోహదం చేసింది.ఈ ప్రక్రియ లో సెన్సెక్స్ కనిష్టం గా 16764 పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే మా అంచనాలకు అనుగుణం గా మరొక సారి 16754 పాయింట్ల కీలక మద్దత్తు నిలబడటం తో మార్కెట్లు పుంజుకొని చివరకి 16806 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. .

నేడు మిడ్ క్యాప్ రంగం 1.41 % , స్మాల్ క్యాప్ రంగం ౦. 46 % వృద్ధి చెందటం విశేషం.

మెటల్ హెల్త్‌కేర్ స్టాకులు అత్యధికంగా లాభపడ్డాయి. అయితే ఐటీ, బ్యాంకింగ్ స్టాకులు నష్టపోయాయి. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 2.28 శాతం, కన్సుమేర్ డ్యుర బుల్ల్స్ ఇండెక్స్ 4.58 శాతం చొప్పున వృద్ధి చెందగా.. ఐటీ ఇండెక్స్ 2 .74శాతం, టెక్ ఇండెక్స్ 1.97 శాతం చొప్పున బలహీనపడ్డాయి.

సెన్సెక్స్ స్టాకు ల లో Sterlite industries 5.5 % , Jp associates 2.3 % చొప్పున లాభాలను ఆర్జించాయి. కాగా Wipro 4.3 % , Maruti 3.9 % అత్యదికం గా క్షీణించాయి.