• 09-10-2009 :: 8:30 am
  • మార్కెట్ నాడి

అమెరికా ఫెడ్ చైర్మన్ గత రాత్రి విడుదల చేసిన ప్రకటన లో , ఆర్ధిక వ్యవస్థ మెరుగైతే వడ్డీ రేటు ని పెంచగలమని ప్రకటించటం , అక్కడి నిరుద్యోగ గణాంకాలు ఊరట కలిగించే విధం గా ఉండటం తో nasdaq , s & p లాభాలను ఆర్జించాయి. కాగా ప్రెసిడెంట్ ఒబామా డాలర్ క్షీణత పై స్పందిస్తూ, డాలర్ విలువని ఎట్టి పరిస్థితి లోనైనా పరిరక్షిస్తామని భరోసా ఇవ్వటం కూడా అక్కడి మార్కెట్లను ఉత్తేజ పరిచాయి.

ఈ అంశం వలన ఆసియా మార్కెట్లు సానుకూలం గా శుభారంభం చేసినా , అమ్మకాల వత్తిడి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.

మన మార్కెట్ల పరం గా చర్చిస్తే, గత రెండు రోజులు గా బలహీనంగా వున్న మన మార్కెట్లు , నేడు ట్రేడింగ్ ప్రారంభ సమయానికి ఆసియా మార్కెట్ల పరిస్థితి కి అనుసంధానం గా ట్రేడ్ కానున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ , ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఆహువాలియా విడి విడి గా చేసిన ప్రకటన ల లో , మన దేశం లో ఉద్దేపన ప్యాకేజీలు కొనసాగుతాయని, వృద్ధి రేటు 7 % సమీపించే వరకు , ద్రవ్యోల్బణం కొంత పెరుగుతున్నా , వడ్డీ రేటు ని పెంచబోమని తెలపటం వలన , గత నాలుగు రోజులు గా బలపడుతున్న రూపాయి విలువ నేడు కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం వలన గత మూడు రోజులు గా భారి గ క్షీణించిన ఐ.టి వాటా ల లో కొంత పుల్ బ్యాక్ ర్యాలీ కనిపించవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16843
  • మద్దత్తులు:16754-16613-16565
  • ఆవరోధాలు :16866-16978- 17014