08-10-2009
మార్కెట్ రిపోర్ట్
స్టాక్ మార్కెట్ నేడు ఫ్లాట్ గా ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 37 పాయింట్లు పుంజుకుని 16,844 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 5,002 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.22 శాతం, నిఫ్టీ 0.33 శాతం చొప్పున బలపడ్డాయి.నిన్నటి నష్టాలకు బ్రేక్ వేస్తూ.. స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉదయం 164 పాయింట్లు పుంజుకుని 16,971 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో లాభపడినప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 16,775 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది.ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో మళ్లీ లాభాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బుల్స్, బేర్స్ యుద్ధమే నేటి స్టాక్ మార్కెట్‌లో కనబడిందని చెప్పొచ్చు. ఒక సెషన్ తర్వాత మరొక సెషన్‌లో బుల్స్, బేర్స్ పోటీ పడ్డాయి. దీంతో ఒక సెషన్లో బాగా కూరుకుపోయిన సెన్సెక్స్.. మరొక సెషన్‌లో పుంజకుంది.ఈ యుద్ధం మాటున స్టాక్ మార్కెట్ లావాదేవీలు అదేవిధంగా సాగాయి. ఈ తరుణంలో ఆసియా మార్కెట్ల నుంచి వీచిన బలమైన సంకేతాల ప్రభావం, అలాగే సుమారు 12 ఏళ్ల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశ్చర్యపరుస్తూ బోనస్ ప్రకటించడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌కు శక్తినిచ్చాయి.ఒకానొక దశలో సెన్సెక్స్ స్వల్పంగా తగ్గినా.. ఎఫ్ఎంసీజీ, ఇంధన స్టాకుల్లో కొనుగోళ్లు.. తిరిగి స్టాక్ మార్కెట్ కోలుకునేందుకు దోహదం చేశాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణ నివేదిక కూడా సాయపడింది. సుమారు రెండు నెలల తర్వాత 0.7 శాతం మేరకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది.చివర్లో బేర్స్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. లాభార్జన విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ విధం గా జరిగే అవకాశం ఉందని నేటి ఉదయమే చర్చించామని మీకు తెలుసు. దీంతో స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గుముఖం పట్టాయి. చివరికి స్వల్ప లాభంతో ప్రశాంతంగా స్టాక్ మార్కెట్ ముగిసింది. టాటా మోటార్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా సంస్థలు భారీగా క్షీణించకుండా నియంత్రించగలిగాయి.
నేడు స్మాల్ క్యాప్ రంగం 0.22 %, మిడ్ క్యాప్ రంగం 0.79 % మేరకు లాభపడ్డాయి.
నేడు బీఎస్ఈ రియాలిటీ ఇండెక్స్ 2.09 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2 .01శాతం మేరకు లాభపడింది. టెలికాం స్టాకులు మరో సారి నష్టపోయాయి. . ఐటీ స్టాకులు నేడు కూడా నష్టాలతో ముగిశాయి . ఇవి 1 .86 శాతం నష్టపోయాయి. కాగా నేటి ట్రేడింగ్ లో టెక్ ఇండెక్స్ అత్యధికం గా 2.80 శాతం నష్టపోయింది .
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే BHARTI AIRTEL 6.6 % , RCOM 6 % నష్టపోయాయి. కాగా TATA MOTORS 5.4 %, RELIANCE INFRA 4.9 % ఎగబాకాయి.