- 08-oct-2009 :: 8 :00 am
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్ల లో అక్కడి కంపనీల మెరుగైన ఫలితాల అంచనాల తో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. పైగా బ్యాంక్ఆఫ్ అమెరికా , మదుపర్లకు , మార్కెట్లు కొనుగోలు చేయవచ్చన్న సూచన ఇవ్వటం తో అప్పటివరకు ఒడిదుడుకుల తో పయనిస్తున్న nasdaq , s & p లాభాలబాట లో నడిచాయి. ఈ అంశం మన ఆసియా మార్కెట్లను కూడా సానుకూలం గా ప్రభావితం చేస్తున్నాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్ మార్కు లో పయనిస్తున్నాయి. నిన్న రెండు వారాల కనిష్ట స్థాయి లో ముగిసిన మన మార్కెట్ల కి ఈ అంశం కొంత ఊరట కలిగించ నున్నది.
RIL బోనస్ వాటాలను తమ వాటా దారులకు ఇవ్వనున్నట్లు ప్రకటించటం కూడా నేడు సెన్సెక్స్ పెరుగుదలకు దోహద పడే అవకాశాలు ఉన్నాయి. పైగా ప్రభుత్వం NTPC లో మరికొంత భాగం పబ్లిక్ ఇష్యూ ద్వారా జనవరి మాసం లో అమ్మనున్నట్లు ప్రకటించటం, ESSAR GROUP ప్రపంచ వ్యాప్తం గా తమ కార్య కలాపాలను భారి స్థాయి లో వృద్ధి చేయనున్నట్లు ప్రకటించటం మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరిచే విధం గా ఉన్నాయి.
ఐతే నేడు మార్కెట్లు పెరిగినా , ఇది కేవలం స్వల్పకాలానికే అని మరువకూడదు. మదుపర్లు వీలైనంత వరకు cash లో ఉండటం మంచిది.
టెక్నికల్ గా సెన్సెక్స్ నకు 16613 పాయింట్ల వద్ద అతి కీలక మద్దత్తు ఉంది. నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు పెరిగినప్పుడు మరొక సారి నిన్నటి విధం గా నే ప్రాఫిట్ బూకింగ్ చోటుచేసు కునే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16806
- మద్దత్తులు: 16754-16613-16565
- ఆవరోధాలు :16886-16978- 17014 -17124