06-10-2009 :: 8 am

మార్కెట్ నాడి

సేవా పరిశ్రమ కి సంబంధించిన గణాంకాలు మెరుగ్గా ఉండటం తో అమెరికా మార్కెట్ల లో ఆశలు చిగురించాయి. దీనింతో గత రాత్రి అక్కడి మార్కెట్లు నష్టలా బాటను వీడి లాభాల లో పయనించాయి. ఈ అంశం నేటి ఉదయం జపాన్ మార్కెట్ల పై కూడా ఔషధం లా పనిచేయటం తో జపాన్ మార్కెట్లు కూడా గ్యాప్ అప్ తో ప్రారంభమవ్వటంవిశేషం. ఈ అంశం తో ఇతర ఆసియా మార్కెట్లు కూడా సానుకూలం గా స్పందిస్తున్నాయి. సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం వలన నేడు మన మార్కెట్లు కూడా శుభారంభం చేసే అవకాశం ఉంది.

ఐతే ఆంధ్రా కర్ణాటక రాష్ట్రాల లో వరద భీబత్సం వలన ఈ ప్రాంతాల లో నెలకొని ఉన్న రసాయన, సిమెంట్ కంపనీలు తీవ్రం గా నష్టపోయాయి కనుక , ఈ కంపనీల వాటాలు నేడు నష్టపోయే అవకాశం ఉంది. అంతే కాక కంపనీల సి. ఈ .వొ ల జీతభత్యాల కుదింపు పై జాతీయ స్థాయి లో జరిగుతున్న చర్చ కూడా మార్కెట్ల ని ప్రభావితం చేసే అవకాశం ఉంది

టెక్నికల్ గా పరిశీలిస్తే మన మార్కెట్లు ఇప్పటి కే తారా స్థాయి లో ఉన్నాయి కనుక , నేడు మార్కెట్లు పెరిగితే మదుపర్లు తమ లాంగ్ పోసిషన్లను తగ్గించుకోవటం ఉత్తమం. సెన్సెక్స్ నకు 16613 పాయింట్ల వద్ద అతి కీలక మద్దత్తు ఉంది. నేటి ట్రేడింగ్ లో ఈ మద్దత్తు వద్ద మార్కెట్లు నిలకడ పొందే అవకాశం ఉంది. 17 వేల మార్కు ని , అంతర్జాతీయా మార్కెట్ల సానుకూల ప్రభావం వలన నేడు సెన్సెక్స్ మరో సారి 17 వేల మార్కు ని దాటే ప్రయత్నం చేయనున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16866
  • మద్దత్తులు: 16844-16754-16613-16565
  • ఆవరోధాలు :16886-16978- 17014 -17124