05-10-2009 :: 6 :30 pm
మార్కెట్ రిపోర్ట్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 268 పాయింట్లు కోల్పోయి 16,866 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 5,003 వద్ద ముగిసింది.ఈ రోజు ఉదయం 73 పాయింట్ల నష్టంతో 17,062 వద్ద స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. రోజంతా స్టాక్ మార్కెట్ ఏ మాత్రం కోలుకోలేదు. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు దాదాపు నష్టాలతోటే ముగిశాయి. గ్లోబల్ ట్రెండ్‌తో గత వారంలో 17 నెలల గరిష్ఠ స్థాయిని చేరుకున్న స్టాక్ మార్కెట్ ఈ రోజు మాత్రం.. లాభార్జన కోసం ఇన్వెస్టర్లు తెగబడటంతో ఒకానొక దశలో 268 పాయింట్లు నష్టపోయింది.ముగిసిన గత మూడు సెషన్లలో 441.5 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఈ రోజు మాత్రం 268.14 పాయింట్లు కోల్పోయి 16,866.41 పాయింట్లు నష్టపోయింది. ఉదయం మేము సూచించిన విధం గా అమెరికా ఉద్యోగ నివేదిక సెంటిమెంట్ ఆసియా మార్కెట్లన్నింటిపై ప్రభావం చూపింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం శాతం క్షీనించ గా , స్మాల్ క్యాప్ రంగం శాతం నష్టపోయింది.
నేడు ఎఫ్. యం . సి. జి మినహా అన్ని సేక్టరాల్ ఇండెక్స్ లు నష్టాల లో ముగిసాయి. ఈ రంగం కేవలం 1.47 % వృద్ధిని చేయగా, రియాలిటీ 3.53 % , టెక్ 2.57 % అత్యధిక నష్టాలను చవి చూసింది.
నేడు టెలికాం రంగానికి చెందిన స్టాకులు భారి గా నష్టపోయాయి. BHARTI AIRTEL, RCOM, TTML 8.1 %, 5.6 %, 5.7 % చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు భారతి అయిర్ టెల్ 8.1 % నష్టపోగా గ్రాసిం 7.1 % నష్టపోయింది. గ్రాసిం పునవ్యవస్తీకరణ గురించి యాజమాన్యం చేసిన ప్రకటన వలన ఈ కౌంటర్ బలహీనపడింది.