మార్కెట్ ముందు చూపు

( 05 - oct -2009 నుండి 09 - oct -2009 వరకు )

గత వారం కేవలం మూడు రోజులే ట్రేడ్ అయిన సెన్సెక్స్ , ఈ వారం పూర్త స్థాయి లో ట్రేడ్ కానున్నాయి. గత వారం సెన్సెక్స్ 17 వేల మార్కు ని దాటి ముగియటం, నిఫ్టీ 5 వెల పాయింట్లు దాటటం మదుపర్లకు కొంత ఊరట కలిగించాయి. గత వారం సెన్సెక్స్ గరిష్టం గా 17, 195 పాయింట్ల వరకు ఎగబాకింది. మేము గత వారం ఈ శీర్షిక లో సెన్సెక్స్ నకు 17, 230 పాయింట్ల టార్గెట్ గా తెలియచేసిన విషయం మీకు తెలుసు.

ఈ వారం అంశాలను పరిశీలిస్తే, ముఖ్యం గా , కంపనీల రెండవ త్రై మాసిక ఫలితాలు మదుపర్ల ద్రుష్టి ని ఆకర్షించ నున్నాయి. ఈ అంశం సెన్సెక్స్ గమనాన్ని , దిశని ప్రభావితం చేయనున్నది. ఇవి ఆశాజనకం గా ఉండే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల కారణం గా రానున్న రోజుల లో స్టాకు ల వారి గా మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంది.

ఐతే మార్కెట్లు ఇప్పటి కే తారా స్థాయి కి చేరుకున్నాయి కనుక మార్కెట్లు ఇక్కడి నుండి మరికొంత పెరిగినా , లాభాలు ఎక్కువకాలం నిలిచే అవకాశం తక్కువ. ముఖ్యం గా ప్రప్రంచ మార్కెట్ల తీరు మార్కేట్లని కొంత నిరుత్సాహ పరిచే విధం గా ఉన్నాయి. అమెరికా మార్కెట్ల లో పెరుగుతున్న నిరుద్యోగ గణాంకాలు, తగ్గుముఖం పట్టిన పారిశ్రామిక గణాంకాలు , మరొక సారి సబ్ ప్రైం సమస్య పునరావృత్తం అవుతుందా అన్న భయాందోళనలు సెంటిమెంట్ ని దెబ్బతీస్తున్నాయి. మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్లకి అతీతం గా ఈ వారం పైకి ఎగసినా చివరికి ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక , మునుముందు మార్కెట్ల ఊర్ధ్వ పయనం , మదుపర్లు తమ పొజిషన్ లను తగ్గించుకునేందుకు వినియోగించుకోవటం మంచిది. ఐ. ఎం .ఎఫ్ ప్రకారం కూడా , ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి ముందుగా 1.4 % క్షీణించి , తదుపరి 2010 సంవత్సరానికి 2.5 % వృద్ధి సాధించ గలదని ఆశాభావం వ్యక్తం చేయటం ఈ సందర్భం లో గమనార్హం

ఇక మన దేశం గణాంకాలుపరిశీలిస్తే, వాతావరణ శాఖ 1972 తరువాత అతి తక్కువ వర్షపాతం ఈ సారి దేశం లో నమోదు అయ్యిందని , ఇది సాధారణం కంటే 23 % తక్కువగా ఉందని తెలియపరచటం ద్వారా రానున్న రోజుల లో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గనున్నది అంచనా వేయవచ్చు. పైగా ద్రవ్యోల్బణం సైతం స్థిరం గా పెరుతున్నది కనుక వచ్చే మర్చి నెల కి ఇది గరిష్టం గా 7 % వరకు ఎగబాకవచ్చని అంచనా. ఇంకా ప్రపంచ మార్కెట్లు పూర్తి గా కోలుకుంటే తప్ప క్షీణిస్తున్న మన ఎగుమతుల గణాంకాలు తమ పంధా మార్చే అవకాశం లేదు కాబట్టి , ఈ వారం మార్కెట్లు మన కంపనీల ఉత్తమ ఫలితాల నేపథ్యం లో కొంత పెరిగినా , అతి త్వరలో మరల దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

టెక్నికల్ గా పరిశీలిస్తే సెన్సెక్స్ 18 వేల మార్కు వైపు ఉరకలు వేసే దిశ గా పయనిస్తోంది. సెన్సెక్స్ నకు 17041-16 ,683- 16, 565 -16340-16237కీలక మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 16, 340 వద్ద సెన్సెక్స్ నకు విశేషమైన మద్దత్తు ఉంది. ఈ మద్దత్తు వీగిపోతే 14800 పాయింట్ల వరకు సెన్సెక్స్ క్షీణించే ప్రమాదం ఉంది. కాగా 17373-17505-17678-17838-18048 సెన్సెక్స్ నకు అవరోధాలు