• 01-10-2009
  • మార్కెట్ రిపోర్ట్
బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు దిశా హీనం గా సంచరించాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సూచీ 7 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేస్తూ 17134 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 0.55 పాయింట్లు కోల్పోయి 5083 పాయింట్ల వద్ద ముగిసింది.
నేడు సెప్టెంబర్ 19 కి చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు ౦.83 % వృద్ధి ని నమోదు చేసింది. ఇది ౦.7 % గా ఉండవచ్చన్న అంచనాలకి మించి నమోదు కావటం తో మార్కెట్లు మరింత బలహీన పడ్డాయి. మార్చ్ ఆఖరునకు ఇది 8 % వరకు పెరిగే అవకాశాం ఉందన్న అంచానాలు సెంటిమెంట్ ని మరింత బలహీన పరిచింది. పైగా , రేపటి నుండి వరుస సెలవల కారణం గా కూడా మార్కెట్ల లో పెద్ద గా క్రయ విక్రయాలు చోటు చేసుకోలేదు.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦.35 శాతం క్షీనించ గా , స్మాల్ క్యాప్ రంగం 0.04 శాతం నష్టపోయింది
సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేడు టెక్ రంగం 1.45 % , ఐ. టి రంగం ౦.88 % వృద్ధిని నమోదు చేసాయి. కాగా హెల్త్ కేర్ 1.3 % , ఆటో ౦.92 % మేరకు క్షీణించాయి.
ఇక సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , Bharti airtel -Mtn మధ్య ఒప్పందం సాధ్యపడదని తేలిపోవటం తో నేడు Bharti Airtel 4 % ఎగబాకింది. కాగా RCOM , MICROSOFT తో జరుపుకున్న ఒప్పందం వలన 3.2 % లాభపడింది. కాగా మారుతి వాటాలు నేడు 2.82 % క్షీణించాయి.