05-10-2009:: 8 : 15 AM

మార్కెట్ నాడి

శుక్రవారం ప్రపంచ మార్కెట్లు, ముఖ్యం గా ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూసాయి. అమెరికాలో అంచనాలకి మించి నిరుద్యోగ గణాంకాలు నమోదు కావటం పట్ల , ఆసియా మార్కెట్ల ఎగుమతులు క్షీణించే ప్రమాదమున్నదని ఈ మార్కెట్లు బలహీనపడ్డాయి. అమెరికా మార్కెట్లు సైతం నష్టానికి గురి అయ్యింది. నేటి ఉదయం ఆసియా మార్కెట్లు తీవ్ర ఆటు పొట్ల కి గురి అవుతున్నాయి. ముఖ్యం గా కామోడిటి మార్కెట్ల లో ఓపెన్ ఇంటరెస్ట్ తీవ్రం గా పెరిగి పోవటం వలన మార్కెట్లు తారా స్తాయి కి చేరాయన్న సంకేతాలు ఇస్తోంది కనుక అతి త్వరలో కామో డిటి మార్కెట్ల లో దిద్దు బాటు జరిగే అవకాశం ఉంది.

ఈక్విటీ పరం గా ఆలోచిస్తే , మన మార్కెట్ల లో కంపనీలు రెండవ త్రై మాసిక ఫలితాలు వేలవడనున్న నేపథ్యం లో ,ముఖ్యం గా ఐ. టి. , బ్యాంకింగ్ కంపనీలు ఉత్తమ ఫలితాలు అందించ గలవన్న అంచనాల తో మన మార్కెట్లు స్టాకు ల వారి గా ముందంజ వేసే అవకాశం ఉంది. ఐతే అంతర్జాతీయ మార్కెట్ల బలహీన మైన సంకేతాల వలన మన మార్కెట్లు కూడా కొంత ఆటుపోట్ల కి గురి అయ్యే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17135
  • అవరోధాలు: 17230-17366-17497
  • మద్దత్తులు:17124-17014-16978-16886