• 01-10-2009 :: 8 :30 am IST

  • మార్కెట్ నాడి
చికాగో బిజినెస్స్ గణాంకాలు దారుణం గా ఉండటం తో అమెరికా మాంద్యం నుండి కోలుకునేందుకు సుదీర్ఘ కాలం పట్టవచ్చన్న ఆందోళన తో , ఎగుమతులు క్షీణించే అవకాశాలు ఉండవచ్చని అంచనాల తో నేడు ఆసియా మార్కెట్లు కుదేలు మన్నాయి .నేటి ట్రేడింగ్ లో ఈ ప్రభావం మన మార్కెట్ల పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
అణు బాంబుల తయారి కి ఇరాన్ చేస్తున్న కసరత్తుల పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అవసరమైతే ఇరాన్ పై సైనిక చర్య కి కూడా సిద్ధమని ప్రకటించటం కూడా రానున్న రోజుల లో మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం కనపరిచే అవకాశం ఉంది. అంతే కాక వరుసగా, గత రాత్రి రెండవ సారి సునామి పసిఫిక్ ప్రాంతాల లో చోటుచేసుకొని , ఇండోనేసియా ని ప్రభావితం చేయటం కూడా మార్కెట్లు సూక్ష్మంగా గమనించే అవకాశాలు ఉన్నాయి.
ఈ కారణాల వలన రా నున్న రోజుల లో మార్కెట్లు కొంత ఆందోళన కి గురి అయ్యే అంశాలు పెరుగుతున్నాయి కనుక, మదుపర్లు తమ పోజిషన్లు తగ్గించుకోవటం పై దృష్టి సాగిస్తే మంచిది.
మన దేశ పరిస్థి ని సమీక్షిస్తే , నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం కూడా మార్కెట్లు గమనించనున్నాయి.
టెక్నికల్ గా చార్టు లు బలం గా నే ఉన్నాయి . 17366 పాయింట్ల అవరోధాన్ని చేదిస్తే , మార్కెట్లు మరింత గా పుంజు కోనున్నాయి .ఐతే రేపటి నుండి సుదీర్ఘ సెలవల కారణం గా నేటి ట్రేడింగ్ లో అమ్మకాల వత్తిడి కనిపించే అవకాశం లేకపోలేదు.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17126
  • అవరోధాలు: 17230-17366-17497
  • మద్దత్తులు:17124-17014-16978-16886