• 30-09-2009 :: 6 :30 pm (IST)
  • మార్కెట్ రిపోర్ట్
ఆయిల్ ఇండియా వాటాలు అంచనాలని మించి అద్భుతం గా అరంగేట్రం చేయటం , త్వరలో వేలవడనున్న రెండవ త్రై మాసిక కంపనీ ల ఫలితాలు ఆశాజనకం గా ఉంటాయన్న అంచనాల తో నేడు మార్కెట్లు ఆద్యంతం లాభాల లో నడిచాయి. నేటి ట్రేడింగ్ లో నిఫ్టీ 77 పాయింట్లు లాభ పడి 5084 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ 16 నెలల గరిష్ట స్థాయి లో17 వేల మార్కు ని దాటి 17126 పాయింట్ల వద్ద ముగిసాయి. నేడు సెన్సెక్స్ 274 పాయింట్లు ఎగబాకాయి. నేటి ఉదయం మేము సూచించిన కీలక మజిలి ఐన 17124 పాయింట్ల కి అతి చేరువ గా 17126 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగియటం విశేషం.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.95 శాతం వృద్ధి ని నమోదు చేయగా, స్మాల్ క్యాప్ రంగం 0.94 శాతం వృద్ధి చెందింది.
సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 3.69 % , ఆటో రంగం 2.13 % లాభాలను ఆర్జించాయి.
కాగా FMCG 0.42 %, కన్సుమేర్ డ్యుర బుల్స్ 0.26 % మేరకు నష్టపోయాయి.
సెన్సెక్స్ వాటాలను పరిశీలిస్తే నేడు SBI 5 % , ICICI బ్యాంకు 4.6 % ఎగబాకాయి. కాగా ONGC 1.2 %, ITC 1 % నష్టాలను నమోదు చేసాయి.