• 27-09-2009

  • మార్కెట్ ముందు చూపు

(29-09-2009 నుండి 01-10-2009 వరకు )

గత వారం 48 పాయింట్ల స్వల్ప నష్టం తో సెన్సెక్స్, 17 పాయింట్ల నష్టం తో నిఫ్టీ ముగిసాయి .గత వారం నిఫ్టీ 5000 పాయింట్ల ని డాతం విశేషం . ఐతే ప్రపంచ మార్కెట్ల లో నెలకొని ఉన్నా బలహీనతల కారణం గా మార్కెట్లు నష్టాలను నమోదు చేసాయి.

ఈ వారం మార్కెట్ల కు సోమవారం, శుక్రవారం సెలవలు కాబట్టి ట్రేడింగ్ కేవలం ౩ రోజులే కొనసాగ నున్నది. కాబట్టి ట్రేడర్లు ఈ వారం అప్రమత్త ధోరణి అలవరచుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ ౩౦ వ తేది అంతర్జాతియ హెడ్జ్ ఫండ్ల రిడంప్షన్ కి చివరి తేది కావటం వలన మార్కెట్ల లో క్రయ విక్రయాలు తక్కువ గా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం మార్కెట్ల పి ఈ నిష్పత్తి సుమారు 22 గా ఉండటం కూడా ఫండమెంటల్ గా మార్కెట్లు తారా స్థాయి కి చేరుకున్నట్లు చెప్పు కోవచ్చు. ఐతే అక్టోబర్ మాసం నుండి రెండవ త్రై మాసిక ఫలితాలు కంపనీలు విడుదల చేయనున్నాయి కాబట్టి , ఈ గణాంకాలు మార్కెట్ల తదుపరి దశ నిర్ధారించ నున్నాయి. ఐతే గత వారం ఈ శీర్షిక లో మా అంచనాలకి మేము మార్కెట్ల లో క్యు . ఐ. పి. విధానం ద్వారా కంపనీలు నిధుల సమీకరణాల కి యత్నాలు చేసే అవకాశం ఉందని తెలియచేసాము. మా అంచనాలను నిజం చేస్తూ కంపనీలు క్యు. ఐ. పి. విధానాన్ని అనుసరించాయి. ఈ వారం కూడా మరికొన్ని కంపనీలు ఈ బాట పట్టే అవకాశం ఉంది. కాబట్టి స్టాకు ల వారి గా మార్కెట్లు ట్రేడ్ కా నున్నాయి. గత వారం చివర లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాల లో సంచలనం కనిపించింది. ఈ వారాం స్మాల్ క్యాప్ రంగానికి చెందిన స్టాకు లు మరికొంత వృద్ధి చెందే అవకాశం ఉంది.

ఈ వారం ఆయిల్ ఇండియా లిస్టింగ్ కా నున్నది. లిస్టింగ్ లాభ సాటి గా జరిగితే మార్కెట్ సెంటిమెంట్ కొంత మెరుగుపడవచ్చు. అయినప్పటి కి , అక్టోబర్ మాసం లో మార్కెట్లు సర్వసాధారణం గా దిద్దుబాటు కి గురిఅవుతూనే వచ్చాయి కాబట్టి ఈ అంశం మార్కెట్లను బలహీన పరచనున్నది.

టెక్నికల్ గా చార్టు ల లో పెద్ద గా ఆందోళన చెందవలసిన పరిస్థితి కనిపించక పోయినప్పటికీ , ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానం గా నే ఈ వారం కూడా మన మార్కెట్లు పయనించే అవకాశం ఉంది. సెన్సెక్స్ నకు 16823-16987-17041-17124-17230 వద్ద అవరోధాలు కాగా 16 ,683- 16, 565 -16340-16237-15995 కీలక మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 16, 340 వద్ద సెన్సెక్స్ నకు విశేషమైన మద్దత్తు ఉంది. ఈ మద్దత్తు వీగిపోతే మార్కెట్లు క్షీణించే ప్రమాదం ఉంది.