- 25-09-2009 :: 6 :30 pm
- మార్కెట్ నాడి
బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో, సుదీర్ఘ వారాంత సెలవల కారణం గా నేటి ట్రేడింగ్ లో మదుపర్లు అప్రమత్త ధోరణి ని అలవరచుకొన్నారు. దీనితో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన మన మార్కెట్లు చివరికి నష్టాలను నమోదు చేస్తూ ఈ వారాన్ని ముగించాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 88 పాయింట్లు కోల్పోయి 16693 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నేటి ఉదయం మేము సూచించిన మద్దత్తు స్థాయి ఐన 16683 పాయింట్ల కి అత్యంత సమీపమని గుర్తించాలి. నేడు నిఫ్టీ 27 పాయింట్లు బలహీన పడి 4959 పాయింట్ల వద్ద ముగిసింది.
ఉదయం నుండి నష్టాల లో నడిచిన మన మార్కెట్లు ఒక దశ లో పుంజుకొని పాజిటివ్ జోన్ లో ప్రవేశించినా, తీవ్ర మైన అమ్మకాల వత్తిడి వలన, బలహీనమైన ఐరోపా మార్కెట్ల వలన మార్కెట్లు యధాతథం గా నష్టాల బాట పట్టాయి.
ఐతే , నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.65 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.91 శాతం లాభం పడటం విశేషం . నేడు హెల్త్ కేర్ రంగం అత్యధికం గా 5.22 % లాభపడింది. కాగా చమురు మరియు గ్యాస్ రంగం 0.97 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా మెటల్స్ నేడు 2.23 % , ఐ. టి 1.17 % అత్యధికం గా నష్టపోయిన రంగాలు గా నిలిచాయి .
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు సన్ ఫార్మ అత్యధికం గా 7 % ఎగబాకింది. కాగా రిలయన్స్ 1.2 % లాభాలను ఆర్జించింది. టాటా స్టీల్ 2.8 % , ICICI బ్యాంక్ 2.5 % క్షీణించాయి.
విజయ దశమి ని పురస్కరించు కొని సోమవారం స్టాక్ మార్కెట్ల కి సెలవు.