29-09-2009:: 9 :05 Am (IST)
మార్కెట్ నాడి
సుదీర్ఘ సెలవల తరువాత నేడు మన మార్కెట్లు పునః ప్రారంభం కానున్నాయి. గత రెండు రోజుల ప్రప్రంచ మార్కెట్ల గతి ని నేటి ట్రేడింగ్ లో మన మార్కెట్లు అనుసంధానం చేసుకోనున్నాయి. సోమవారపు ట్రేడింగ్ లో ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి పట్ల పశ్చిమ ఆసియా లో కొంత అలజడి కి కారణ మైయ్యింది. ఈ కారణం గా బంగారం కి డిమాండ్ పెరగటం, డాలర్ క్షీనించటం జరిగింది. ఐతే అమెరికా మార్కెట్ల లో ఆర్ధిక మాంద్యం అంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నందున , అమెరికా మార్కెట్లు గత రాత్రి లాభాల లో పయనించాయి. క్షీణిస్తున్న డాలర్ ని అరికట్టే దిశగా తగిన రీతి లో స్పందిస్తుందని జపాన్ బ్యాంకు భరోసా ఇవ్వటం తో నేడు అక్కడి మార్కెట్లు లాభాల లో పయనిస్తోంది. ఈ ప్రభావం చైనా మినహా ఇతర ఆసియా మార్కెట్ల పై కూడా చూపెట్టటం తో , నేడు ఇతర ఆసియా మార్కెట్ల లో కూడా బుల్ల్స్ హవా కొనసాగుతోంది.
మన మార్కెట్ల విషయం పరిశేలిస్తే, సెలవల కారణం గా పోసిషన్లు తగ్గించుకున్న ట్రేడర్లు , ఈ వారం కూడా ఇదే అప్రమత్త ధోరణి ని అవలంభించే ఆస్కారం ఉంది కనుక నేటి ట్రేడింగ్ వాల్యూం పెద్దగా ఉండక పోవచ్చు. మార్కెట్లు నేడు దిశా హీనం గా పయనించే ఆస్కారం ఉంది. ఐతే జూన్ త్రై మాసిక కరెంట్ ఎకౌంటు వివరాలను రిజర్వు బ్యాంక్ రేపు ప్రకటించ నున్నది. పెరిగిన సాఫ్ట్ వేర్ ఎగుమతుల వలన ఈ గణాంకాలు ఉత్సాహ పరిచే విధం గా ఉండే అవకాశం ఉందని ఆంచనా. ఈ అంశం పట్ల , ట్రేడింగ్ సమయం లో మరిన్ని వివరాలు వస్తే, మార్కెట్లు కొంత పుంజుకునే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16693
- మద్దత్తులు: 16683-16565 -16452-16348
- అవరోధాలు :16754-16844-16978- 17014