- 30-09-2009 :: 8:15 AM (IST)
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు దిశాహీనం గా పయనించటం , నేటి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటం వంటి అంశాల నడుమ నేడు మన మార్కెట్లు మరొక సారి ట్రేడ్ కానున్నాయి.
జపాన్ పరిశ్రామికాభివృద్ధి గణాంకాలు గడిచిన 12 సంవత్సరాలలో అత్యంత ఉత్తమమైనదిగా నమోదు కావటం తో ఆసియా మార్కెట్లు కొంత ఉత్సాహం గా ప్రారంభమైనాయి. ఐతే ఆసియా పసిఫిక్ మహాసముద్రం లో సునామి చోటు చేసుకోవడం వలన అప్పడి వరకు లాభాల లో పయనిస్తున్న జపాన్ మార్కెట్ నష్టాల బాట పట్టింది. ఈ సునామి వలన సమోవ దీవులు, అమెరికా సమోవా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. జరిగిననష్టం అంచనాల బట్టి నేటి మార్కెట్లు వాటి దిశ ని నిర్ధారించు కొనున్నాయి
మన దేశం లో ని స్థితి గతు లను పరిశీలిస్తే, నేడు రిజర్వు బ్యాంక్ జూన్ త్రై మాసిక కరెంటు ఎకౌంటు గణాంకాలను విడుదల చేయనున్నది. ఇది ఆశాజనకం గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఈ అంశం మార్కెట్లకు చేయూత నివ్వనున్నది. ఐతే ఆహార మంత్రిత్వ శాఖ , ఈ సారి బియ్యం , పప్పు దినుసుల ఉత్పత్తి గణనీయం గా తగ్గే సూచనలు ఉన్నాయని చేసిన ప్రకటన మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నేడు ఆయిల్ ఇండియా వాటాలు మార్కెట్ లో లిస్టింగ్ కానున్నాయి. ఇది లాభ సాటి గా జరిగితే , మార్కెట్ సెంటిమెంట్ కొంత బలపడే అవకాశం ఉంది.
ఈ కారాణాల వలన నేడు మన మార్కెట్ల లో కొంత అనిశ్చిత చోటు చేసుకునే అవకాశం ఉంది. టెక్నికల్ గా సెన్సెక్స్ 16,650 ~16,900 మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16853
- మద్దత్తులు: 16844-16754-16683-16565
- ఆవరోధాలు :16886-16978- 17014 -17124