• 29-09-2009
  • మార్కెట్ రిపోర్ట్
ఆసియా మార్కెట్లు ట్రేడింగ్ ఊపుతో పాటు దేశీయ సంస్థలకు చెందిన వాటాలు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి, 16,853 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 48 పాయింట్ల వృద్ధితో 5006 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 5 వేల మార్కు దాటి నిఫ్టీ ముగియటం విశేషం. కాగా నేడు కూడా సెన్సెక్స్ ఉదయం మా అంచనాలకి అనుగుణం గా ఆద్యంతం లాభాల లో పయనిస్తూ , మేము సూచించిన కీలక మజిలి ఐన 16, 844 కి అత్యంత సమీపం గా ముగియటం విశేషం .నేడు 16, 829 పాయింట్ల వద్ద గ్యాప్ అప్ తో ప్రారంభ మైన సెన్సెక్స్ చివరి వరకు సుమారు 100 పాయింట్ల వ్యత్యాసం తో ట్రేడ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ కనిష్టం గా 16802 మార్కు ని, గరిష్టం గా 16908 మార్కు ని నమోదు చేసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.61 % వృద్ధి చెందగా , స్మాల్ క్యాప్ రంగం ౦.93 % లాభ పడింది.
సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు కేవలం రియాలిటీ రంగం 0.65 % క్షీణించగా మిగిలిన అన్ని ఇండెక్స్ లు లాభాలను ఆర్జించాయి. నేటి ట్రేడింగ్ లో ఐ.టి రంగం 2.26 % , హెల్త్ కేర్ 1.63 % ఎగబాకాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే సన్ ఫార్మ నేడు 6 %, టి . సి . ఎస్. 4 % వృద్ధిచెందాయి . కాగా SBI 2.3 %, GRASIM 1.6 % నష్టపోయాయి.