- 25-09-2009 :: 9 AM
- మార్కెట్ నాడి
అమెరికా లో నూతన గృహ కొనుగోళ్ళ గణాంకాలు నిరుత్సాహ పరిచే విధంగా ఉండటం తో నిన్న రాత్రి అక్కడి మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం వలన ఆసియా మార్కెట్లు సైతం నేడు నష్టాల లో పయనిస్తున్నాయి .
మన మార్కెట్లు నిన్న చివరి అరగంట ట్రేడింగ్ లో లాభాలు గడించినా , ఈ వృద్ధి సెంటిమెంట్ ని బలపరిచే విధం గా లేదు . పైగా కంపనీల తీరు ని పరిశీలిస్తే, SUZLON, JP ASSOCIATES, CIPLA - క్యు .ఐ. పి. విధానం ద్వారా నిధులు సమకూర్చుకునే విధం గా చర్యలు చేపట్టాయి. AXIS, KING FISHER ,GAMMON INFRA, HCL INFO, RCOM, 3i Infotech, PSTL, PANTALOON కంపనీలు కూడా ఇదే బాట లో నడవనున్నట్లు ప్రకటించాయి. ఈ తీరుని గమనిస్తే , పెరిగిన మార్కెట్లను సొమ్ము చేసుకునే విధం గా తమ స్టాకు లను క్యు. ఐ. పి. విధానం ద్వారా సొమ్ము చేసుకునే ప్రయత్నం లో ఈ కంపనీలు ఉన్నాయని స్పష్టమౌతున్నది . ఈ అంశం మార్కెట్లు దాదాపు తారాస్థాయి చేరుతున్నట్లు మనకి సంకేతాలు ఇస్తున్నట్లు మనం భావించాలి. మార్కెట్లు అడపా దడపా కొంత పెరిగినా , దిద్దుబాటు త్వరలో చోటు చేసుకునే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారం అక్టోబర్ మాసం లో మార్కెట్లు దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లు పెరిగినప్పుడల్లా , అంచల వారిగా కొంత సొమ్ము చేసుకోవటం ఉత్తమం. బాగా అనుభవం వుంటే తప్ప , ఈ పరిస్థితి లో కొత్త గా పెట్టుపడులు పెట్టటం అంత శ్రేయస్కరం కాదు. చివరి క్షణం దాకా నిరీక్షించే బదులు ,రాగల పది రోజులలో కొంత కొంత సొమ్ము చేసుకోవటం ఉత్తమం. మార్కెట్లు మధ్య లో కొంత పెరిగినా, అప్పుడు వచ్చే లాభం కంటే, చివరి క్షణం లో అమ్మేలేక ఇరుక్కు పోయి వాటిల్లే నష్టం ఎక్కువ. మదుపర్లు అప్రమత్తం గా వ్యవహరించ వలసిన సమయం ఆసన్నమయ్యింది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16781
- మద్దత్తులు: 16754-16683-16565
- అవరోధాలు :16844-16978- 17014