• 24-09-2009 :: 6 pm
  • మార్కెట్ రిపోర్ట్

నేడు బలహీన మైన ప్రపంచ మార్కెట్ల నడుమ పేలవం గా ప్రారంభమైన మన మార్కెట్లు చివరి అరగంట లో జరిగిన షార్ట్ కవెరింగ్ వలన పుంజుకొని లాభాలను గడించింది. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకుని 16,781 పాయింట్ల వద్ద నిలిచింది. . నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 17 పాయింట్లు వృద్ధి చెంది 4987 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి F & O ముగింపు లో 143948 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఇంత భారి మొత్తం లో టర్న్ ఓవర్ జరగటం సెన్సెక్స్ చరిత్ర లో ఇదే ప్రధమం. ఈ అంశాన్ని ప్రతిబింబిస్తూ సెన్సెక్స్ కంటే ఎక్కువగా మిడ్ క్యాప్ రంగం 0.74 % , స్మాల్ క్యాప్ ౦.46 % వృద్ధిని నమోదు చేసాయి. పైగా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా అప్రమత్త ధోరణి లో ట్రేడ్ అవుతున్న నేపధ్యం లో మన మార్కెట్లు లాభాల బాటలో పయనించటం నేటి విశేషం గా చెప్పుకొనవచ్చు. ప్రపంచ మార్కెట్ల ధోరణికి అతీతం గా మన మార్కెట్లు ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని నేటి ఉదయమే మేము సూచించిన విషయం ఈ సందర్భం లో గమనార్హం.

నేడు సెప్టెంబర్ 12 కి చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం సెప్టెంబర్ 12కు ముగిసిన వారాంతానికి 0.37శాతానికి చేరుకుంది. అదే అంతకు మునుపు వారాంతానికి ద్రవ్యోల్బణం 0.12శాతంగా ఉండింది. నిత్యావసర సరుకుల ధరలు నిరుడు ఇదే కాలానికి పోలిస్తే 12.42శాతంగా ఉండింది.

నేటి ట్రేడింగ్ లో బ్యాంకెక్స్ రంగం అత్యధికం గా 1.48 % లాభ పడగా , హెల్త్ కేర్ రంగం 0.91 % వృద్ధిని నమోదు చేసింది. అత్యదికం గా నష్టపోయిన రంగాల లో ఐ.టి 1.59 % క్షీణించి ప్రధమ స్థానం లో నిలువగా, మెటల్స్ 1.13 %

నష్టపోయి రెండవ స్థానం లో నిలిచింది.

సెన్సెక్స్ స్టాకు ల వారిగా పరిశీలిస్తే , నేడు HDFC, HDFC BANK 3.4 % చొప్పున ఎగబాకాయి . కాగా HINDALCO 4 % , INFOSYS 3.4 % బలహీన పడ్డాయి.