• 24-09-2009 :: 8:15AM
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా ఫెడ్ కీలక సమావేశాల లో అక్కడి వడ్డీ రేటు పై నిర్ణయం తీసుకోవటం జరిగింది. వడ్డీ రేటు ని తగ్గించి ఉంచాలని నిర్ణయం తో పాటు మార్ట్ గేజ్ సెక్యురిటి ల కొనుగోళ్ళ ను తగ్గించాలని తీసుకున్న నిర్ణయం తో అక్కడి మార్కెట్లు నష్టపోయాయి. నేటి ఆసియా మార్కెట్లను సమీక్షిస్తే , జపాన్ ఎగుమతులు వరుసగా 11 వ నెల తగ్గుముఖం పట్టటం తో సెంటిమెంట్ బలహీనపడింది. అంశాల వలన ఇతర ఆసియా మార్కెట్లు కూడా తీవ్ర ఒడిదుడుకుల తో నేడు ట్రేడ్ అవుతున్నాయి.

మన మార్కెట్ల విషయం పరిశీలిస్తే , నేడు F & O ముగింపు వలన మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల పోకడ కి అతీతం గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేటి ట్రేడింగ్ దిశ కేవలం ROLL OVER ల పైనే ఆధార పడనున్నది . నేటి మధ్యాన్నం ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నది. ఈ అంశం కూడా మదుపర్ల ద్రుష్టి ని ఆకర్షించే విషయం

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16719
  • మద్దత్తులు: 16683-16565 -16452
  • అవరోధాలు :16844-16754-16978