• 23-09-2009 :: 6 :20 PM
  • మార్కెట్ రిపోర్ట్
లాభార్జనలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 167 పాయింట్లు పాయింట్లు కోల్పోయి 16,720 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 4,970 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.99 శాతం, నిఫ్టీ 1.00 శాతం మేరకు క్షీణించాయి.ఈ రోజు ఉదయం 19 పాయింట్లు లాభంతో 16,905 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లోనే స్టాక్ మార్కెట్ రెడ్ మార్కులోకి ప్రవేశించింది. మధ్యాహ్నం వరకు ఒడిదుడుకుల మధ్యే స్టాక్ మార్కెట్ పయనించింది. స్టాక్ మార్కెట్ చివరి ఒక గంటలో జరిగిన ట్రేడ్‌లో.. లాభార్జన కోసం ఇన్వెస్టర్లు మరింతగా ఆసక్తి చూపారు.ఈ ప్రక్రియలో సెన్సెక్స్ 220 పాయింట్లు కోల్పోయి 16,684 వద్దకు కనిష్ఠంగా పడిపోయింది. ఐతే మేము ఉదయం సూచించిన 16,683 పాయింట్ల మద్దత్తు స్థాయి నిలబడటం తో చివరికి సెన్సెక్స్ 16,717 వద్ద ముగిసింది. నిన్న 5వేల మార్కుకు పైన ముగిసిన నిఫ్టీ ఈ రోజు ఆ మార్కు కన్నా దిగువున ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.23 % , స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.37 % నష్టపోయింది. సేక్టరాల్ వారిగా పరిశీలిస్తే , నిన్నటి ట్రేడింగ్ లో భారిగా నష్టపోయిన ఆయిల్ మరియు చమురు ఇండెక్స్ నేడు లాభపడింది. నేటి ట్రేడింగ్ లో కేవలం ఈ రంగం మాత్రమె లాభాపడటం విశేషం. నేడు తక్కిన అన్ని రంగాలు నష్టాల బాట లో నడిచాయి. నేడు రియాలిటీ రంగం 2.38 % , టెక్ రంగం 1.98 % అత్యధికం గా నష్టాలను నమోదు చేసాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు JP అసోసియేట్స్ 6.3 % నష్టపోయింది. ఈ కంపనీ తమ 4 కోట్ల విలువ గల ట్రెజరీ వాటాలను రూ. 238/- చొప్పున అమ్మివేయటం ఇందుకు కారణమయ్యింది. గత ముగింపు లో ఈ కౌంటర్ ధర రూ. 250/- గా ఉండటం గమనార్హం. నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ BHARTI AIRTEL నేడు కూడా 3.4 % నష్టపోయింది. కాగా HDFC 1.4 % , STERLITE 1.1 % లాభాలను ఆర్జించాయి.