• 23-09-2009:: 8 :20 am

  • మార్కెట్ నాడి
అమెరికా ఫెడ్ రిజర్వు కీలక సమావేశాల లో , అక్కడి వడ్డీ రేటు పై నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వడ్డీ రేటు ని తక్కువగానే ఉంచే అవకాశం ఉందని అంచనా. ఈ కారణం గా ప్రపంచ మార్కెట్ల లో డాలర్ మరింత గా బలహీన పడుతోంది. ఈ నేపధ్యం లో కామోడిటి మార్కెట్ల లో బుల్ రన్ కొనసాగుతోంది. ఇక ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే ,నేడు ఆసియా మార్కెట్లు బలహీనం గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ అంశం మన మార్కెట్లను స్వల్పంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఐతే, కంపనీల ముందస్తు పన్ను దాఖలు ఉత్సాహ పరిచే విధం గ ఉండటం, ఆర్ధిక మంత్రి , దేశం లో వడ్డీ రేటు ని తగ్గించే ఉంచి , మరింత చేయూత కి దోహద పడనున్నట్లు ప్రకటించటం కూడా మన మార్కెట్ల సెంటిమెంట్ ని బలపరచనుంది. కాగా రేపు F & O ముగింపు కారణం గా మార్కెట్లు , పై అంశాలకు అతీతం గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16886
  • మద్దత్తులు: 16844-16754-16683-16565
  • అవరోధాలు :16978- 17014-17124