• 22-09-2009:: 6:15 pm
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ , నేడు మన మార్కెట్లు మందకొడి గా ప్రారంభమైనప్పటికీ , సెప్టెంబర్ కి ముగిసిన త్రైమాసిక కార్పొరేట్ పన్ను వాసులు లో 14 .7 % వృద్ధి కనబరిచిందని ఆర్ధిక శాఖ ప్రకటించటం తో మార్కెట్ల లో ఉత్సాహం నెలకొని లాభాల బాట లో కొనసాగింది. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 145 పాయింట్లు పుంజుకుని 16,886 పాయింట్లకు ఎగబాకింది. . నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి ఐదు వేల మార్కు దాటటం నేటి ట్రేడింగ్ విశేషం. నిఫ్టీ 5020 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 0.87 శాతం, నిఫ్టీ 0.89 శాతం మేరకు వృద్ధి చెందాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.74 % , స్మాల్ క్యాప్ రంగం 1.05 % లాభపడటం నేటి ట్రేడింగ్ విశేషం. సేక్టరాల్ ఇండెక్స్ ని పరిశీలిస్తే నేడు ఆయిల్ మరియు చమురు ఇండెక్స్ మినహా అన్ని రంగాలు లాభాలను ఆర్జించాయి. ఆయిల్ మరియు చమురు ఇండెక్స్ 0.03 % స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది. కాగా నేడు ఐ. టి ఇండెక్స్ 1.9 % , FMCG ఇండెక్స్ 1.6 % లాభాలను నమోదు చేసాయి. ప్రపంచ మార్కెట్ల లో అమెరికా డాలర్ విలువ పడిపోతున్నప్పటికి నేడు ఐ.టి ఇండెక్స్ లాభపడటం విశేషం.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే ,నేటి ట్రేడింగ్ లో HDFC 5.3 % ఎగబాకింది. కాగా TCS 2 2.9 % మేరకు లాభాలను ఆర్జించింది. కాగా JP ASSOCIATES 2.7 %, BHARTI AIRTEL 3.3 % అత్యధికం గా నష్టాలను నమోదు చేసింది.