• 22-09-2009 :: 8 AM
  • మార్కెట్ నాడి

నిన్న రంజాన్ కారణం గా ప్రపంచం లో పెక్కు మార్కెట్లు ట్రేడ్ కాలేదు . ఐతే ట్రేడ్ ఐన కొన్ని ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు నిన్న బలహీనపడ్డాయి. అమెరికా లో విడుదల ఐన ఆర్ధిక గణాంకాలు ఆశాజనకం గా ఉన్నప్పటికీ, రికవరీ కి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి అని అమెరికా ఫెడ్ ప్రకటన కూడా మార్కెట్ సెంటిమెంట్ ని కొంత బలహీన పరిచాయి. కాగా వివిద దేశాల కరెన్సీతో మారకపు విలువలో డాలర్‌ బలపడటం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ ని కృంగదీసాయి . ఐతే మన దేశ పరిస్థి తి ని పరిశీలిస్తే , మార్చ్ నెల కి ద్రవ్యోల్బణం 5.2 % వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని , దీనిని అరికట్టే విధానం లో , సారి రూపాయి విలువను బలపరిచే విధానాలు అవలంభించే అవకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ చేసిన ప్రకటన వలన ప్రపంచ మార్కెట్ల బలహీన సెంటిమెంట్ కి కొంత విరుగుడు గా పనిచేయనున్నది. ఐతే ఇది సాఫ్ట్ వేర్ కంపనీలకి ప్రతికూల అంశం ఐనప్పటికీ, దిగుమతులు, ఆయిల్ కంపనీలకి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది .

ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముకర్జీ , రాబోయే త్రైమాసికాల లో GDP వృద్ధి 6 % కంటే తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేయటం వలన నేడు మన మార్కెట్ల లో గత వారం కనిపించిన బుల్ రన్ కి బ్రేక్ పడే అవకాశం ఉంది. నేడు మార్కెట్ల లో కొంత లాభాల స్వీకరణ జరిగే అవకాశం లేకపోలేదు.

గురు వారం ముగియ బోయే F & O నేపధ్యం లో స్టాకు వారిగా ట్రేడ్ చేయటం ఉత్తమం

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16741
  • మద్దత్తులు: 16683-16565-16452-16348
  • అవరోధాలు :16754-16844-16978-17014