మార్కెట్ ముందు చూపు

(22-09-2009 నుండి 25-09-2009 వరకు )

గత వారం , 16 నెలల గరిష్ట స్థాయి నమోదు చేసిన మన మార్కెట్లు ఈ వారం , సుదీర్ఘ వారాంతం కారణం గా కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ కా నున్నాయి. పై గా ఈ గురువారం F & o ముగింపు , ఈ వారానికి మరింత ప్రాముఖ్యత ఆపాదించ నుంది.

" మార్కెట్ ముందు చూపు " శీర్షిక లో గతవారం ప్రస్తావించిన మా అంచనాలని మరొక సారి నిజం చేస్తూ , నిఫ్టీ 5 వేల మార్కు ని తాకటం, సెన్సెక్స్ 16, 741 పాయింట్ల వద్ద ముగియటం విశేషం. గత ఆది వారమే మేము , సెన్సెక్స్ నకు 16, 754 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం ఉందని ముందే తెలియ చెప్పామని మీకు తెలుసు.

ఇక రాబోయే ట్రేడింగ్ రోజుల గురించి ఆలోచన చేస్తే, సోమవారం రంజాన్ కారణం గా మార్కెట్ల కు సెలవు. మన మార్కెట్ల తో పాటు ఆసియా లో ని కొన్ని ఇతర మార్కెట్ల కి కూడా సోమవారం సెలవు కాబట్టి మంగళవారం ట్రేడింగ్ మన మార్కెట్లకు కీలకం. ముఖ్యం గా సోమ, మంగళ వారాల లో అమెరికా ఫెడ్ సమావేశాలలో చేయబోయే ప్రకటనల నేపథ్యం లో మంగళవారం మన మార్కెట్లు ట్రేడింగ్ లో తీవ్రతకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతున్నట్లు పలు గణాంకాలు విడుదల అవ్వటం ఫెడ్ సమావేశాలను , తద్వారా మన మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.

దేశీయ గణాంకాలను పరిశీలిస్తే, గత గురవారం విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాలు తిరిగి పాజిటివ్ జోన్ లో ప్రవేశించటం , ఈ సంవత్సరం ఋతుపవనాలు పరవాలేదని వాతావరణ శాఖ చేసిన ప్రకటన, ముందస్తు పన్ను చెల్లింపు గణాంకాలు మార్కెట్ల పై ప్రభావం కనపరిచాయి. ఈ అంశాలు ఈ వారం కూడా, స్టాకు ల వారిగా మరికొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

మన మార్కెట్లు లాభాల లో పయనిస్తుండటం వలన రిలయన్స్ వాటాలను గత వారం పెట్రోల్ ట్రస్ట్ బ్లాక్ డీల్ ద్వారా 1.5 కోట్ల వాటాలను రూ 2125 చొప్పున అమ్మివేయటం జరిగింది. ఇతర కంపనీలు కూడా తమ నూతన ప్రాజెక్ట్ల కు నిధులను సమకూర్చుకునేందుకు గాను ఇదే పంధా ని అనుసరించవచ్చు . తద్వారా కొన్ని స్టాకులు అమ్మకాల వత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది.

ఈ గురువారం F & O ముగింపు కారణం గా మార్కెట్లు బుధ , గురువారాల లో ప్రపంచ మార్కెట్ల పోకడ కి అతీతం గా , ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లు , ప్రస్తుతం లాభాల బాట లో పయనిస్తునా, F & O గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అంశాలు తెలియవస్తాయి. ప్రస్తుతం PUT CALL నిష్పత్తి 1.70 గా ఉంది. ఇది వాస్తవానికి చాలా ఎక్కువ. అదే విధం గా OPEN INTEREST 116, 551 కోట్ల రూపాయలు గా ఉంది. ఇది కూడా , గత కొన్ని మాసాల కి గాను గరిష్ట స్థాయి. నిఫ్టీ P /E నిష్త్పత్తి కూడా 22.41 గా ఉంది. ఈ అంశాలు మార్కెట్లు పతాక స్థాయికి చేరుకున్నట్లు సూచనలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ వారం స్టాకు ల వారిగా ట్రేడ్ చేయటం ఉత్తమం. కన్ని ముఖ్యమైన స్టాకు ల F & O పరిస్థితి ఈ విధం గా ఉన్నాయి.

RELIANCE, JINDALSTEL, BHARTIARTL, SBIN, RELCAPITAL, SUZLON, LT, JPASSOCIAT, RELINFRA, GMRINFRA, AXISBANK, RPOWER, UNITECH, TATAPOWER, SESAGOA, GESHIP & BAJAJ-ఆటో ల లో లాంగ్ పోసిషన్ లు ఉన్నాయి.

ICICIBANK, TATASTEEL, INFOSYSTCH, RCOM, TATAMOTORS, HDFC, BHEL, ZEEL & INDIANB. ల లో షార్ట్లు ఏర్పడ్డాయి.

DLF, HCC, ESSAROIL, CAIRN, IDBI, GTLINFRA, ABAN, HCLTECH, SYNDIBANK & IOB. ల లో పోసిషన్లు తగ్గుముఖం ( UNWINDING ) పడుతున్నాయి.

ఇక టెక్నికల్ గా పరిశీలిస్తే , ఈ వారం సెన్సెక్స్ ఒడిదుడుకులకు లోనయ్యే ఆస్కారం ఉంది. సెన్సెక్స్ నకు 16823-16987-17041-17124-17230 వద్ద అవరోధాలు ఉన్నాయి. ఐతే సెన్సెక్స్ కనుక 16897 పాయింట్లు దాటగలిగితే 17 వేల పాయింట్లను దాటే అవకాశం ఎక్కువగా ఉంది. కాగా 16 ,683- 16, 565 -16348-16237-15995 కీలక మద్దత్తు స్థాయిలు. ముఖ్యం గా 16, 237 వద్ద సెన్సెక్స్ నకు విశేషమైన మద్దత్తు ఉంది.

ఈ వారం మార్కెట్ గమానాన్ని F & O ముగింపు నిర్ధారించ నున్నది.