- 18-09-2009 :: 6 :30 pm
- మార్కెట్ రిపోర్ట్
బలహీన మైన ఆసియా మార్కెట్ల నడుమ నేడు మన మార్కెట్లు , మా అంచనాలకు అనుగుణం గా నష్టాల తో ప్రారంభమయ్యి , చివరికి షార్ట్ కవెరింగ్ వలన ఫ్లాట్ గా ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ కేవలం 30 పాయింట్లు పుంజుకుని 16,741 వద్దకు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 4,976 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 0.18 శాతం, నిఫ్టీ 0.21 శాతం మేరకు వృద్ధి చెందాయి.
16, 650 పాయింట్ల వద్ద ప్రారంభ మైన సెన్సెక్స్ , మరింత క్షీణిస్తూ 16610 పాయింట్ల వరకు దిగజారింది. ఐతే DR. REDDY ల్యాబ్ లో 5 % వాటా UK కి చెందిన GSK కొనుగోలు చేయనున్నదన్న వార్త వలన మార్కెట్ సెంటిమెంట్ కొంత బలపడెందుకు తోడ్పడింది. దీనికి తోడు షార్ట్ కవెరింగ్ నేపధ్యం లో సెన్సెక్స్ 16, 765 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మేము ఉదయం సూచించిన అవరోధం 16, 754 బలం గా ఉండటం తో , మార్కెట్లు క్రమంగా తగ్గి చివరికి , సెన్సెక్స్ 16,741 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45 % , స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.77 % లాభ పడ్డాయి.
సేక్టరల్ ఇండెక్స్ ని పరిశీలిస్తే, నేడు ఆటో ఇండెక్స్ అత్యధికం గా 2.1 % వృద్ధి చెందగా , రియాలిటీ రంగం 1.29 % ఎగబాకింది. కాగా బ్యాంకెక్స్ 1.2 %, PSU 0.2 % నష్టాలను చవిచూసాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో ICICI బ్యాంక్ 3.4 %, సన్ ఫార్మ 1.6 % బలహీన పడగా , మారుతి 5.2 %, రిలయన్స్ ఇన్ఫ్రా 4.5 % ఎగబాకాయి.
సోమవారం రంజాన్ పండుగ కారణం గా స్టాక్ మార్కెట్లకి సెలవు.