- 18-09-2009 :: 8am
- మార్కెట్ నాడి
లాభాల స్వీకరణ తో గత రాత్రి అమెరికా మార్కెట్లు కోల్పోవటం తో నేడు ఆసియా మార్కెట్లు కూడా అదే దారి పట్టాయి. గత రాత్రి అమెరికా లో విడుదల ఐన పలు ఆర్ధిక గణాంకాలు ఆశాజనకం గా ఉన్నా , అక్కడి మార్కెట్లు గత తొమ్మిది రోజుల లాభాల బాట కి స్వస్తి చెపుతూ , నిన్న లాభాల స్వీకరణ తో ముగిసింది. నేడు ఆసియా మార్కెట్లు కూడా , అమెరికా మార్కెట్ల ప్రభావం వలన ఒడిదుడుకుల తో పయనిస్తున్నాయి.
మన మార్కేట్లని పరిశీలిస్తే, నిన్న మధ్యాన్నం నుండే మన మార్కెట్ల లో లాభాల స్వీకరణ ప్రారంభమయ్యిందని చెప్పాలి. నిన్నటి పంథా నే , నేడు కూడా మన మార్కెట్లు అనుసరించే అవకాశాలు ఉన్నాయి. పైగా నేడు వారాంతం కనుక , ఈ అంశం మరింత ప్రాముఖ్యత నేటి ట్రేడింగ్ లో సంతరించికోనున్నది.
ఐతే అమెరికా లోని పెన్షన్ ఫండ్ లు భారత్ లో ముఖ్యం గా రోడ్ల వ్యవస్థ లో పెట్టుపడి పెట్టాలని నిర్ణయించటం, జపాన్ సహాయం తో ఢిల్లీ- ముంబై ల మధ్య రైల్వే గూడ్స్ కారిడార్ నిర్మాణం కి గాను నిధుల సమీకరణ ఈక్విటీ మార్కెట్ల నుండి కొంత భాగం నిధులు సమీకరించాలని కాబినెట్ నిర్ణయం , నేడు మార్కెట్ సెంటిమెంట్ ని బలపరిచే అవకాశం ఉంది.
టెక్నికల్ గా మార్కెట్లు నేడు కొంత , అతి స్వల్ప దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16711
- మద్దత్తులు: 16683-16565-16452-16348
- అవరోధాలు :16754-16844-16978-17014