• 17-09-2009 :: 6 PM
  • మార్కెట్ రిపోర్ట్
ఆరంభ శూరత్వం కనపరుస్తూ గ్యాప్ అప్ తో ప్రారంభమైన మన మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిసాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ కేవలం 34 పాయింట్లు పుంజుకుని 16,711 వద్దకు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 4,966 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.20 శాతం, నిఫ్టీ 0.14 శాతం మేరకు వృద్ధి చెందాయి.
అంతకుముందు..మేము ఉదయమే సూచించిన విధం గా , అంతర్జాతీయ మార్కెట్ల అందించిన సహకారంతో స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఈ లాభాల ప్రక్రియలో నిఫ్టీ 5వేల మార్కును సైతం దాటింది. అలాగే సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 16,820 వద్దకు చేరుకుంది. అయితే మధ్యాహ్నపు ట్రేడ్‌ల నుంచి ప్రతికూల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావటం తో సెన్సెక్స్ బలహీనపడింది. ఇది కూడా ఉదయం మేము సూచించిన రీతి లో నే జరగటం విశేషం . పైగా రిలయన్స్ మరియు ఇతర కంపెనీల షేర్లలో లాభార్జన కోసం సాగిన క్రయవిక్రయాలతో స్టాక్ మార్కెట్ బలహీన పడేందుకు మరింత తోడ్పడింది. చివరికి సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 16,711 వద్ద ముగిసింది. మార్చి 2, 2008 తర్వాత నిఫ్టీ తొలిసారిగా గరిష్ఠ మార్కును నమోదు చేసింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఐటీ ఇండెక్స్ 1.91 శాతం, టెక్ ఇండెక్స్ 1.92 శాతం మేరకు వద్ధి చెందగా.. చమురు మరియ సహజవాయువుల ఇండెక్స్ 2.86 శాతం, రియాల్టీ 0.91 శాతం మేరకు క్షీణించాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.13 % మేరకు వృద్ధి ని నమోదు చేసాయి . నేడు, సెన్సెక్స్ స్టాకు ల లో రిలయన్స్ ఘోరం గా 4.4 % క్షీణించగా , టాటా స్టీల్ 2 % నష్టపోయింది. కాగా ACC, HINDALCO 3.6 % చొప్పున ఎగబాకాయి.