17-09-2009 :: 8:45 am

మార్కెట్ నాడి

ఊహించిన దానికంటే మెరుగైన IIP గణాంకాల నేపధ్యం లో గత రాత్రి అమెరికా మార్కెట్లు 15 మాసాల గరిష్ట స్థాయి లో ముగిసాయి. . ఇతర గణాంకాలు కూడా ఆశా జనకం గా ఉండటం తో నేడు ఆసియా మార్కెట్ల లో కూడా బుల్ల్స్ హవా కొనసాగుతోంది.

ఈ అంశాల వలన నేడు మన మార్కెట్ల లో కూడా బుల్ల్స్ జోరు కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్ల లో మెటల్స్ ఇండెక్స్ ల లో బుల్ల్స్ వీర విహారం చేస్తున్నందున, నేటి ట్రేడింగ్ లో STERLITE INDUSTRIES, HINDUSTAN COPPER S విదేశీ సంస్థాగత మదుపర్ల దృష్టి ని ఆకర్షించే అవకాశం ఉంది.

నేటి మధ్యాన్నం ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ అంశం మన మార్కెట్ల ను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. . ఇది నేటి మార్కెట్ల లో బుల్ల్స్ దారి లో SPEED BREAKER లా వ్యవహరించే అవకాశం ఉంది. ఐనప్పటికీ, ఐరోపా మార్కెట్లు కూడా ప్రపంచ మార్కెట్ల విధం గానే శుభారంభం చేయగలిగితే, నేడు మన మార్కెట్ల లో బుల్ల్స్ పూర్తి గా తమ సత్తా చాటనున్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16677
  • మద్దత్తులు: 16565-16452-16348
  • అవరోధాలు :16683-16754-16882