• 16-09-2009
  • మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్ల లో బుల్ల్స్ హవా కొనసాగటం తో నేడు కూడా మార్కెట్లు భారి గా లాభ పడ్డాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 223 పాయింట్లు పుంజుకుని 16, 677 వద్ద నిలిచింది. గత ట్రేడింగ్ లో విధం గానే నేడు కూడా మా అంచనాల కి అనుగుణం గా లాభ పడి , సెన్సెక్స్ , మేము ఉదయం సూచించిన కీలక మజిలి ఐన 16, 683 పాయింట్ల కి అత్యంత సమీపం గా ముగియటం విశేషం.

అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 66.30 పాయింట్లు లాభపడి 4,958 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.35 శాతం, నిఫ్టీ 1.36 శాతం మేరకు వృద్ధి చెందాయి .

నేటి ఉదయం 16,498 పాయింట్ల వద్ద గ్యాప్ అప్ తో ప్రారంభ మైన సెన్సెక్స్ , సానుకూల ప్రపంచ మార్కెట్ల ప్రభావం వలన లాభాల బాట లో కొనసాగింది. మధ్యాన్నం ఐరోపా మార్కెట్లు సైతం లాభాల తో ప్రారంభమవ్వటం తో మార్కెట్ల సెంటిమెంట్ మరింత బలపడి గరిష్టం గా 16, 700 పాయింట్ల వరకు చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 16 నెలల గరిష్ట స్థాయి లో 16,677 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు లాభాల లో ముగియటం విశేషం. నేడు మెటల్స్ ఇండెక్స్ 4.20% లాభాలను అర్జిమ్చ గా , ఆటో ఇండెక్స్ 2.23 % వృద్ధిని నమోదు చేసాయి.

నేడు మిడ్ క్యాప్ రంగం 1.45 %, స్మాల్ క్యాప్ రంగం 1.10 % వృద్ధి చెందాయి.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు TATA STEEL 8.21 % ఎగబాకటం విశేషం. TATA MOTORS 6.22 % మేరకు లాభ పడింది.