• 16-09-2009 :: 8 :30
  • మార్కెట్ నాడి

అమెరికా ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నంకే గత రాత్రి విడుదల చేసిన ప్రకటన లో ఆర్ధిక మాంద్యం దాదాపు ముగిసినట్లే అని చెప్పటం తో , అక్కడి మార్కెట్లు లాభాల బాట లోముగిసాయి .నేడు ఆసియా మార్కెట్ల లో, చైనా మార్కెట్లు మినహా అన్ని మార్కెట్లు లాభాల లో నడుస్తున్నాయి. ఈ అంశాలు మన మార్కెట్ల లో నెలకొని ఉన్న ఉత్సాహం కి మరింత చేయూత నివ్వనున్నది.

కంపనీలు ముందస్తు పన్ను దాఖలా వివరాలు మరింత నిశితం గా నేడు తెలియనున్నది కాబట్టి తదనుగుణం గా స్టాకు లు నేడు ముందంజ వేసే అవకాశం ఉంది.

దక్షినాది రాష్ట్రాల లో స్వయిన్ ఫ్లూ విజ్రుంభన కొంత ప్రతికూల అంశం ఐనప్పటికీ ప్రస్తుతం మార్కెట్లు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోక పోవచ్చు.

టెక్నికల్ గా చార్ట్లు కూడా పుంజుకునే విధం గా నే ఉన్నాయి కాబట్టి నేడు కూడా మార్కెట్లు లాభాల బాట లో నడిచే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16454
  • మద్దత్తులు: 16452-16348-16237
  • అవరోధాలు :16565-16683-16754