- 15-09-2009 :: 6 :15 pm
- మార్కెట్ నాడి
15 నెలల గరిష్ట స్థాయి లో నేడు మార్కెట్లు ముగిసాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 240 పాయింట్లు పుంజుకుని 16, 454 వద్ద నిలిచింది. ఇది మేము ఉదయం సూచించిన కీలక మజిలీ అయిన 16, 452 పాయింట్ల కి అత్యంత సమీపం గా ఉండటం నేటి ట్రేడింగ్ విశేషం. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 83.5 పాయింట్లు లాభపడి 4,892 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1.48 శాతం, నిఫ్టీ 1.74 శాతం మేరకు వృద్ధి చెందాయి
నేటి ట్రేడింగ్ లో బుల్ల్స్ తమ సత్తా చాటటం విశేషం. కంపనీల ముందస్తు పన్ను దాఖలు వివరాలు ఆధారం గా నేటి మార్కెట్లు 15 నెలల గరిష్ట స్థాయి లో ముగిసాయి. SBI, LNT మున్నగు సెన్సెక్స్ కంపనీల ముందస్తు ఆదాయపు పన్ను వివరాలు ఉత్సాహం కలిగించే విధం గా ఉండటం తో మార్కెట్ల లో సెంటిమెంట్ బలపడి, ప్రపంచ మార్కెట్ల పోకడ కి అతీతం గా , పైకి ఎగబాకాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.83 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.33 శాతం వృద్ధి ని నమోదు చేసాయి. నేడు అన్ని రంగాలు లాభాల బాట లో నడిచాయి. నిన్న భారి గా నష్ట పోయిన మెటల్స్ ఇండెక్స్ నేటి ట్రేడింగ్ లో పుంజుకొని 3.74 % వృద్ధిని నమోదు చేయటం విశేషం . కాగా నేటి ట్రేడింగ్ లో రియాలిటీ రంగం అత్యధికం గా 3.91 % లాభాలను ఆర్జించింది.
సెన్సెక్స్ స్టాకు ల లో DLF నేడు 5.2 % ఎగబాకింది. HERO HONDA 3.5 % వృద్ధి ని నమోదు చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచింది . ఈ సంవత్సరం BHARTI AIRTEL - MTN ఒప్పందం ఒక కొలిక్కి వచ్చే సూచనలు లేక పోవడం తో నేడు ఈ స్టాకు 0.8 % నష్ట పోయింది. కాగా ONGC 0.9 % బలహీన పడింది.