• 15-09-2009:: 8:40 AM
  • మార్కెట్ నాడి
చైనా-అమెరికా మధ్య ముదురుతున్న వాణిజ్య వివాదం వలన నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా చైనా ఉత్త్పత్తి చేసే టైర్ల పై ఆంక్షలు విధించే యోచన ఉండటం తో , చైనా కూడా స్పందిస్తూ, అమెరికా నుండి కార్లు , చికెన్ మున్నగు ఉత్పత్తు ల పై ప్రతి ఆంక్షలు విధించే దిశ గా అడుగులు వేస్తుండటంవలన ప్రపంచ మార్కెట్ల లో అనిశ్చిత వాతావరణం నలకొని ఉంది.
ఈ ప్రభావం మన మార్కెట్ల పై నిన్న కొంత కనిపించి నప్పటికీ , ఇతర ఆసియా మార్కెట్లు క్షీనించినంతగా మన మార్కెట్లు నష్టపోలేదు. ఆసియా మార్కెట్లు నేడు మరింత ఆటుపోట్లకు గురి అయితే , మన మార్కెట్లు మరింత క్షీణించే ప్రమాదం ఉంది.
ఐతే నేడు DEUTSCHE బ్యాంకు విడుదల చేసిన అంచనాల ప్రకారం , సెన్సెక్స్ టార్గెట్ ని 16, 500 గా ప్రకటించటం మన మార్కెట్లకి కొంత ఊరట కలిగించే అంశం
నేడు ప్రపంచ మార్కెట్ల లో నెల కొని ఉన్నా అన్సిచిత కారణం గా మన మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16214
  • మద్దత్తులు: 16124-16064-16002 -15950
  • అవరోధాలు :16237-16348-16452-16565