14-08-2009 :: 6 : 25 pm
మార్కెట్ రిపోర్ట్
గత వారం వరుస లాభాల తరువాత , నేడు మార్కెట్లు , మా అంచనాలను నిజం చేస్తూ ఆద్యంతం నష్టాల బాట లో పయనించాయి. నేడు సెన్సెక్స్ 50 పాయింట్లు నష్ట పోయి 16 ,214 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 4808 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 0.31 % , నిఫ్టీ 0.43 % క్షీణించింది.
16 , 185 పాయింట్లకు నష్టాల తో ప్రారంభమైన సెన్సెక్స్ , ఆరంభ ట్రేడ్ లోనే 16 ,120 పాయింట్ల వరకు క్షీణించింది. ఆ తరువాత , మార్కెట్లను ఉత్సాహ పరిచే అంశాలు ప్రత్యేకించి లేక పోవటం తో మార్కెట్లు చివరి వరకు నష్టాల బాట లోనే పయనించాయి. మార్కెట్ చివరి నిమిషాల లో మా అంచనాలకు అనుగుణం గా షార్ట్ కవేరింగ్ చోటు చేసుకోవటం తో గరిష్టం గా 16 , 252 పాయింట్ల వరకు చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 16 , 214 పాయింట్ల వద్ద నేటి ట్రేడింగ్ ని ముగించింది.
చాలా కాలం తరువాత నేడు మిడ్ క్యాప్ రంగం 0.15 % , స్మాల్ క్యాప్ రంగం ౦.46 % మేరకు లాభ పడ్డాయి . నేటి ట్రేడింగ్ లో కన్సుమేర్ డ్యుర బుల్స్ 1.1 % , రియాలిటీ ఇండెక్స్ ౦.8 % క్షీనించ గా , ఆటో ఇండెక్స్ 1% , PSU ఇండెక్స్ ౦.9 % లాభాలను ఆర్జించాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో TATA STEEL, TATA MOTORS 2.1% , 2 % చొప్పున లాభ పడగా , STERLITE , HINDALCO 3.6 %, 2.5 % మేరకు నష్టపోయాయి.